ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పెన్షన్‌ తీసుకున్న కాసేపటికే ఆగిన గుండెలు

ABN, Publish Date - Jan 01 , 2025 | 01:36 AM

ఒక రోజు ముందే పెన్షన్‌ తీసుకున్న ఆ ముగ్గురు వృద్ధులు హఠాన్మరణం పాలవడం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.

కల్లూరు, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): ఒక రోజు ముందే పెన్షన్‌ తీసుకున్న ఆ ముగ్గురు వృద్ధులు హఠాన్మరణం పాలవడం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. పులిచెర్ల మండలం కల్లూరు దిగువవీధికి చెందిన కె.సయ్యద్‌సాహెబ్‌ (75) ఇంటి వద్దకు మంగళవారం ఉదయం 5:52 గంటలకు సచివాలయ ఉద్యోగి భరత్‌ చేరుకున్నాడు.ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌ రూ.4వేలు అందజేశాడు. పెన్షన్‌ తీసుకున్న కొద్ది సేపటికే గుండెపోటుతో సయ్యద్‌సాహెబ్‌ మృతి చెందాడు. ఇదే గ్రామంలోని దాసరిగూడేనికి చెందిన పి. అమీనా(79) ఇంటి వద్దకు చేరుకున్న వీఆర్వో శకుంతల ఉదయం 6.47 గంటల సమయంలో పెన్షన్‌ రూ.4వేలు అందజేసింది. పెన్షన్‌ తీసుకున్న అమీనా అదే క్షణంలో గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందింది. దిగువవీధికే చెందిన షేక్‌ సులేమాన్‌(60) ఇంటి వద్దకు సచివాలయ ఉద్యోగి హిమశేఖర్‌ ఉదయం 7.08 గంటలకు చేరుకొని పింఛన్‌ అందజేశాడు.ఇటీవల అనారోగ్యానికి గురైన షేక్‌ సులేమాన్‌ పెన్షన్‌ తీసుకున్న కొంత సేపటికే మృతి చెందాడు.

Updated Date - Jan 01 , 2025 | 01:37 AM