ఆగని బాంబు బెదిరింపులు
ABN, Publish Date - Feb 10 , 2025 | 01:03 AM
తిరుపతిలోని హోటళ్లకు బాంబు బెదిరింపులు ఆగడంలేదు. హ్యూమన్ ఐఈడీ బాంబు పేరుతో హోటళ్లు పేల్చేస్తామని, అందరూ బయటకు వెళ్లిపోవాలని బెదిరిస్తూ రీనెస్ట్, పాయ్ వైస్రాయ్ హోటళ్లకు ఆదివారం మెయిల్స్ వచ్చాయి. ఆయా హోటళ్ల యజమానుల ఫిర్యాదుతో అలిపిరి ఎస్‌ఐ నాగార్జునరెడ్డి, బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాలు ఆయా హోటళ్లకు చేరుకున్నారు. పరిసర ప్రాంతాలు, గదులు, వంటగది.. ఇలా అణువణువు తనిఖీలు చేశారు. ఈ మెయిల్స్ అన్నీ కేరళ నుంచి వస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కాగా, రెండు రోజుల కిందట తిరుచానూరు సమీపంలోని గ్రాండ్ రిడ్జ్.. అంతకుముందు తిరుపతి రూరల్ పరిధిలోని వ్యవసాయ కళాశాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అలాగే, నాలుగు నెలల కిందట ఈ రెండు హోటళ్లతో పాటు, మరో నాలుగింటికీ బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ప్రతి సారి బాంబు, డాగ్ స్క్వాడ్లు తనిఖీలు చేసి ఎలాంటి బాంబులు లేవని తేల్చేస్తున్నారు.

9పీసీఎన్ 1-
ఫ తిరుపతిలో మరో రెండు హోటళ్లకు మెయిల్స్
తిరుపతి(నేరవిభాగం), ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని హోటళ్లకు బాంబు బెదిరింపులు ఆగడంలేదు. హ్యూమన్ ఐఈడీ బాంబు పేరుతో హోటళ్లు పేల్చేస్తామని, అందరూ బయటకు వెళ్లిపోవాలని బెదిరిస్తూ రీనెస్ట్, పాయ్ వైస్రాయ్ హోటళ్లకు ఆదివారం మెయిల్స్ వచ్చాయి. ఆయా హోటళ్ల యజమానుల ఫిర్యాదుతో అలిపిరి ఎస్‌ఐ నాగార్జునరెడ్డి, బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాలు ఆయా హోటళ్లకు చేరుకున్నారు. పరిసర ప్రాంతాలు, గదులు, వంటగది.. ఇలా అణువణువు తనిఖీలు చేశారు. ఈ మెయిల్స్ అన్నీ కేరళ నుంచి వస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కాగా, రెండు రోజుల కిందట తిరుచానూరు సమీపంలోని గ్రాండ్ రిడ్జ్.. అంతకుముందు తిరుపతి రూరల్ పరిధిలోని వ్యవసాయ కళాశాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అలాగే, నాలుగు నెలల కిందట ఈ రెండు హోటళ్లతో పాటు, మరో నాలుగింటికీ బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ప్రతి సారి బాంబు, డాగ్ స్క్వాడ్లు తనిఖీలు చేసి ఎలాంటి బాంబులు లేవని తేల్చేస్తున్నారు.
ఇదంతా ఎవరి పని?
తిరుపతికి వరుస బాంబు బెదిరింపు మెయిల్స్ ఎవరు పంపుతున్నారనేది ప్రశ్నగా మారింది. ఈ మెయిల్ అడ్ర్‌సలు ఎవరివి? ఎక్కడ్నుంచి పంపుతున్నారు? ఏమి ఆశించి ఇలా బెదిరిస్తున్నారనేది అంతుపట్టడం లేదు. దోపిపీ దొంగలు, ఎర్రచందనం స్మగ్లర్లు, గంజాయి బ్యాచ్‌ల కింగ్‌పిన్‌లను సైతం విదేశాల నుంచి పట్టుకొచ్చిన మన పోలీసులు... బెదిరింపు మెయిల్స్ అగంతకులను గుర్తించలేకపోతున్నారు. ఇకనైనా పోలీసులు ఈ ఘటనలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, బెదిరింపు మెయిల్స్ పంపుతున్న నిందితులను గుర్తించి.. వారి ఆటకట్టించాలని స్థానికులు కోరుతున్నారు.
Updated Date - Feb 10 , 2025 | 01:03 AM