ఎస్వీయూలో ట్రాప్ కెమెరాలు, హెచ్చరిక బోర్డుల ఏర్పాటు
ABN, Publish Date - Jan 12 , 2025 | 01:59 AM
పులి వస్తుంది.. జాగ్రత్త అంటూ ఎస్వీయూలో పలు చోట్ల హెచ్చరిక బోర్డులు ఏర్పాటయ్యాయి.
తిరుపతి (విశ్వవిద్యాయాలు), జనవరి 11 (ఆంధ్రజ్యోతి): పులి వస్తుంది.. జాగ్రత్త అంటూ ఎస్వీయూలో పలు చోట్ల హెచ్చరిక బోర్డులు ఏర్పాటయ్యాయి. ఇటీవల చిరుత సంచారం నేపథ్యంలో విద్యార్థులను, ఉద్యోగులను అప్రమత్తం చేస్తూ ఈ బోర్డులు ఏర్పాటయ్యాయి. సాయంత్రం 6 నుంచీ ఉదయం 6 గంటల వరకూ ఎవరూ యూనివర్సిటీలో సంచరించకూడదంటూ ఇందులో అధికారులు సూచించారు. అయితే, ఈ నెల 3 వ తేదీన యూనివర్సిటీలో చిరుత సంచరించినట్టు ఫారెస్టు అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమరాల్లో రికార్డు అయినట్టు సమాచారం. దీంతో, యూనివర్సిటీలో చిరుత పులి ట్రాప్ బోన్లను కూడా ఏర్పాటు చేయాలని యూనివర్సిటీ అధికారులు ఫారెస్టు అధికారులను కోరారు.పులి సంచారం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని వర్సిటీ రిజిస్ట్రార్ భూపతి నాయుడు విజ్ఞప్తి చేశారు.
Updated Date - Jan 12 , 2025 | 01:59 AM