క్యూలైన్ల వద్ద కానరాని వైద్య శిబిరం
ABN, Publish Date - Jan 11 , 2025 | 02:10 AM
వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంగా వ్యహరించిందనే కారణంతో ప్రభుత్వం ఆ శాఖ అధికారులను వివరణ కోరినట్లు సమాచారం. గాయపడిన వారికి సకాలంలో వైద్య సాయం అందలేదని, ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు అంబులెన్సు కూడా అందుబాటులో లేదని అధికారుల విచారణలో తేలింది. సాధారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు చేరే ప్రదేశంలో వైద్య ఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు చేపట్టాలి.
వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై విచారణ
జూ క్యూలైన్ల వద్ద ముందస్తు చర్యలు చేపట్టకపోవడంపై ప్రభుత్వం సీరియస్
తిరుపతి(వైద్యం), జనవరి 10(ఆంధ్రజ్యోతి): వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంగా వ్యహరించిందనే కారణంతో ప్రభుత్వం ఆ శాఖ అధికారులను వివరణ కోరినట్లు సమాచారం. గాయపడిన వారికి సకాలంలో వైద్య సాయం అందలేదని, ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు అంబులెన్సు కూడా అందుబాటులో లేదని అధికారుల విచారణలో తేలింది. సాధారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు చేరే ప్రదేశంలో వైద్య ఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు చేపట్టాలి. తప్పక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడమే కాకుండా అంబులెన్సులను అందుబాటులో ఉంచాలి. రెండు రోజుల క్రితం జరిగిన ఘటనలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయకపోవడం, డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో లేకపోవడం వల్లే ప్రాణనష్టం జరిగిందని అధికారుల విచారణలో తేలడంతో ఇందుకు సంబంధించి పూర్తి వివరణ ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశించినట్లు తెలిసింది.
Updated Date - Jan 11 , 2025 | 02:10 AM