Minister Anagani: తిరుపతికి బయల్దేరిన మంత్రి అనగాని సత్యప్రసాద్
ABN, Publish Date - Jan 09 , 2025 | 09:34 AM
అమరావతి: తిరుపతి తొక్కిసలాట ఘటన నేపథ్యంలో రాష్ర్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గురువారం ఉదయం తిరుపతికి బయలుదేరారు. ఉదయం 9.45 గంటలకు రుయా ఆసుపత్రికి చేరుకొని గాయాలపాలైన భక్తులను మంత్రి అనగాని పరామర్శించనున్నారు. తొక్కిసలాటలో ఆరుగురు చనిపోవడం తన మనసును తీవ్రంగా కలిచివేసిందన్నారు.
అమరావతి: తిరుపతి (Tirupati) తొక్కిసలాట ఘటన నేపథ్యంలో రాష్ర్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ (Minister Anagani Satya Prasad) గురువారం ఉదయం తిరుపతికి బయలుదేరారు. ఉదయం 9.45 గంటలకు రుయా ఆసుపత్రికి చేరుకొని గాయాలపాలైన భక్తుల (Devotees)ను మంత్రి అనగాని పరామర్శించనున్నారు. తొక్కిసలాటలో ఆరుగురు చనిపోవడం తన మనసును తీవ్రంగా కలిచివేసిందన్నారు. గాయాల పాలైన భక్తులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని ఇప్పటికే కలెక్టర్ వెంకటేశ్వరరావు మంత్రి అనగాని ఆదేశాలు జారీ చేశారు. గాయాల పాలైన భక్తుల పరామర్శ అనంతరం కలెక్టర్, ఇతర అధికారులతో అక్కడి తాజా పరిస్థితిని మంత్రి అనగాని సమీక్షించనున్నారు. కాగా ఎన్నికల హామీ మేరకు రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు సంబంధించి గురువారం జరగాల్సిన మంత్రివర్గ ఉప సంఘం భేటీ వాయిదా వేసుకున్నారు. అలాగే సచివాలయంలో మంత్రి లోకేష్ చైర్మన్‌గా ఈరోజు జరగాల్సిన సమావేశం కూడా అనివార్య కారణాలతో వాయిదా వేశారు. మంత్రుల్లో చాలా మంది తిరుపతి దుర్ఘటన బాధితులను పరామర్శకు వెళుతున్నందున వాయిదా పడినట్లు సమాచారం.
ఈ వార్త కూడా చదవండి.. తిరుమలలో పెను విషాదం!
కాగా గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. రుయా స్విమ్స్‌లను సందర్శించి తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో ఈవో ఛాంబర్‌లో సమీక్ష నిర్వహించనున్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో క్షతగాత్రులను రుయా, స్విమ్స్‌లలో సీఎం చంద్రబాబు పరామర్శించనున్నారు.
కాగా తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. టోకెన్ల జారీకి తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో 90 కౌంటర్లు ఏర్పాటు చేయగా... బైరాగిపట్టెడ వద్ద ఈ దారుణం జరిగింది. గురువారం అర్ధరాత్రి నుంచి తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. దీని కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. తిరుపతిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో గురువారం తెల్లవారుజామున 5 గంటల నుంచి టోకెన్లను జారీ చేయాలని టీటీడీ యంత్రాంగం తొలుత నిర్ణయించింది. అయితే... బుధవారం మధ్యాహ్నం నుంచే కేంద్రాల వద్దకు భారీగా భక్తులు తరలి రావడం మొదలైంది. రాత్రి 8 గంటలకు ఒత్తిడి మరింత పెరిగింది. క్యూలైన్లలోకి రాత్రి 9 గంటల నుంచి భక్తులను పంపించడం మొదలుపెట్టారు. దీంతో కేంద్రాల వెలుపల నిరీక్షిస్తున్న భక్తులు క్యూలైన్లలో ప్రవేశించడానికి ప్రయత్నించే క్రమంలో తొక్కిసలాటలు జరిగాయి. మరీ ముఖ్యంగా... బైరాగిపట్టెడ, విష్ణు నివాసం, ఇందిరా మైదానం కేంద్రాల వద్ద తొక్కిసలాటలు జరిగాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుపతి ఘటనపై ప్రముఖుల దిగ్ర్భాంతి.. ఆవేదన..
హుటాహుటిన తిరుపతి చేరుకున్న మంత్రి అనం
సజ్జల భార్గవరెడ్డి చెప్పినట్లు చేశా!
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jan 09 , 2025 | 09:34 AM