ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సగంమందికి పైగా అప్పుల బెడద!

ABN, Publish Date - Jan 02 , 2025 | 01:18 AM

తాజా గణాంకాల ప్రకారం జిల్లాలో ప్రతి వందమందిలో 55 మందికి అప్పులున్నాయి.ఇటీవల జిల్లా బ్యాంకర్ల సంఘం చేపట్టిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.సంపాదన పెరగకపోయినా విపరీతంగా పెరుగుతున్న ధరలు చాలామందిని రుణాల పాల్జేస్తున్నాయి.

సగంమందికి పైగా అప్పుల బెడద!

- జిల్లా జనాభాలో 55శాతం మంది రుణాలు తీసుకున్నవారే

- మధ్యతరగతి నుంచి దిగువ మధ్యతరగతికి జారుకున్న రెండుశాతం

చిత్తూరు కలెక్టరేట్‌, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): తాజా గణాంకాల ప్రకారం జిల్లాలో ప్రతి వందమందిలో 55 మందికి అప్పులున్నాయి.ఇటీవల జిల్లా బ్యాంకర్ల సంఘం చేపట్టిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.సంపాదన పెరగకపోయినా విపరీతంగా పెరుగుతున్న ధరలు చాలామందిని రుణాల పాల్జేస్తున్నాయి. ఆదాయం తగ్గడం, స్తోమతకు మించిన ఖర్చులు, కుటుంబ బాధ్యతలు, పిల్లల చదువులు, అనవసరపు కొనుగోళ్ళు, ఆన్‌లైన్‌ బెట్టింగులు అప్పులకు కారణాలుగా కన్పిస్తున్నాయి. జిల్లాలో రెండుశాతం మంది ఇటీవల కాలంలో మధ్యతరగతి నుంచి దిగువ మధ్యతరగతికి చేరుకున్నారని సర్వేలో తేలింది. కుటుంబంలో సంపాదనపరుడు అకస్మాత్తుగా మరణించడంతో పేదరికంలోకి వెళ్ళిన కుటుంబాలు కొన్నయితే, స్తోమతకు మించి ఖర్చులు చేసి అప్పులపాలై అల్పాదాయవర్గంలోకి వెళ్లిన కుటుంబాలు మరికొన్ని వున్నాయి.

ఒకటి తీర్చేందుకు మరొకటి

ఆర్థిక స్థితిగతులను అనుసరించి తీసుకున్న రుణం చెల్లించేందుకు కొన్ని నెలల నుంచి సంవత్సరాల సమయం పడుతుంది. ఆ కాలంలో కొంతమందికి సంపాదన పెరిగితే, మరికొంతమందికి తగ్గుతోంది. ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్‌ ఫీజులు,మందుల ఖర్చులు, నిత్యావసరాల కోసం ప్రతినెలా చేబదులు తీసుకుంటున్నారు. పండుగలు, ఫంక్షన్ల కోసం కొంతమంది అప్పులు చేస్తున్నారు.పండుగలకే పరిమితమైన వాయిదాల పద్ధతిని బ్యాంకులు ఏడాది పొడవునా ఇస్తుండడంతో అవసరం ఉన్నా, లేకున్నా గృహోపకరణాలను కొనుగోలు చేసి అప్పులపాలైన వారు కూడా ఎక్కువగానే వుంటున్నారు.డ్వాక్రా, మెప్మాల ద్వారా ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద, ప్రైవేటు సంస్థలు సైతం మహిళలకు తక్కువ వడ్డీ పేరిట రుణాలిస్తున్నాయి. ఇంట్లో అవసరాలకనో, బంగారం, చీటీలు, చిన్నపాటి వ్యాపారాలు పెట్టుకోవడం కోసం చాలామంది మహిళలు ఈ రుణాలు తీసుకుంటున్నారు.

జిల్లా జనాభా : 18,76,361

అప్పులున్నవారు : 10,34,927

వ్యవసాయ ఆధారిత రుణాలు : 1,48,558

పంట రుణాలు : 5,13,530

ఎంఎ్‌సఎంఈ :42,930

ఇతరులు :20,418

ప్రణాళికేతర అప్పులు 2,17,635

విద్య సంబంధిత :4,120

గృహావసర రుణాలు :8,736

డ్వాక్రా రుణాలు :65,000

మెప్మా రుణాలు : 15,000

సూక్ష్మరుణ సంస్థల రుణాలు :40వేలు

Updated Date - Jan 02 , 2025 | 01:18 AM