కుప్పానికి కొత్త రెక్కలు
ABN, Publish Date - Jan 04 , 2025 | 01:51 AM
సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం కొత్త రెక్కలు తొడుక్కోబోతోంది. ఇక్కడ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి రంగం సిద్ధమైంది.బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు అనుసంధానంగా ఈ ఎయిర్‌పోర్టును అందుబాటులోకి తెచ్చి.. కుప్పాన్ని శాటిలైన్ సిటీగా మార్చాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. లాజిస్టిక్ హబ్‌గా కుప్పాన్ని మార్చి కార్గో విమానాల ట్రాఫిక్‌ను పెంచనుంది. శుక్రవారం సీఎం చంద్రబాబు రాష్ట్రంలో నిర్మించనున్న 7 కొత్త ఎయిర్‌పోర్టులపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కుప్పం ఎయిర్ పోర్టు గురించి చర్చించారు.
ఫ ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు వేగంగా అడుగులు
ఫ అధికారులతో సమీక్షించిన సీఎం చంద్రబాబు
చిత్తూరు, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం కొత్త రెక్కలు తొడుక్కోబోతోంది. ఇక్కడ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి రంగం సిద్ధమైంది.బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు అనుసంధానంగా ఈ ఎయిర్‌పోర్టును అందుబాటులోకి తెచ్చి.. కుప్పాన్ని శాటిలైన్ సిటీగా మార్చాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. లాజిస్టిక్ హబ్‌గా కుప్పాన్ని మార్చి కార్గో విమానాల ట్రాఫిక్‌ను పెంచనుంది. శుక్రవారం సీఎం చంద్రబాబు రాష్ట్రంలో నిర్మించనున్న 7 కొత్త ఎయిర్‌పోర్టులపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కుప్పం ఎయిర్ పోర్టు గురించి చర్చించారు. ఇప్పటికే కుప్పం ఎయిర్‌పోర్టు కోసం ఫీజిబులిటీ రిపోర్టు సిద్ధం చేశారు. దీని నిర్మాణం రెండు దశల్లో చేపట్టనున్నారు. మొదటి దశలో 683 ఎకరాలు, రెండో దశలో 567 ఎకరాలు కలిపి మొత్తం 1250 ఎకరాల్ని ఇప్పటికే గుర్తించారు. దీనికి సమీపంలో ఐఏఎఫ్, హెచ్‌ఏఎల్, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులున్న కారణంగా ఎయిర్‌స్పేస్ అంశాన్ని కూడా పరిగణన లోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు వివరించారు. ఈ కారణంగా దీనికి సంబంధిత వర్గాల నుంచి ఎన్‌వోసీ తీసుకోవాల్సి ఉంది.
ఫ ఆరేళ్ల ముందే భూమి పూజ
కుప్పం ప్రాంతంలో పూలు, కూరగాయల సాగు అధికంగా ఉండడంతో ఆయా ఉత్పత్తుల్ని రైతులు సకాలంలో ఎగుమతి చేసుకుని లాభపడటానికి కార్గో విమానాశ్రయం (ఎయిర్‌స్ర్టిప్) ఏర్పాటుకు గత టీడీపీ ప్రభుత్వం ఆలోచించింది. అప్పట్లోనే రామకుప్పం మండలంలోని కిల్లాకిపోడు, మణీంద్రం, కడిసినకుప్పం గ్రామాలు.. శాంతిపురం మండలంలోని అమ్మవారిపేట, సొన్నేగానిపల్లె గ్రామాల్లో 495.15 ఎకరాల్ని సేకరించారు. రూ.16.34 కోట్ల పరిహారాన్ని కూడా పంపిణీ చేసేశారు. 2018లో అప్పటి సీఎం చంద్రబాబు భూమి పూజలు కూడా చేశారు.అయితే తరువాత అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం దీన్ని పూర్తిగా విస్మరించింది.మళ్లీ చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చాక మిగిలిన రూ.13.46 కోట్ల పరిహారం పంపిణీలో కూడా ముందడుగు పడింది. అప్పట్లో కార్గో ఎయిర్‌పోర్టు అనుకుని.. అందుకు అనుగుణంగా భూసేకరణ చేశారు. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్గోతో పాటు డొమెస్టిక్ ఎయిర్‌పోర్టును కూడా అందుబాటులోకి తేవాలని నిర్ణయించి మరింత భూమిని సేకరిస్తోంది.
Updated Date - Jan 04 , 2025 | 01:51 AM