భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలు
ABN, Publish Date - Apr 01 , 2025 | 01:09 AM
రంజాన్ సందర్భంగా జిల్లా అంతటా ముస్లింలు సోమవారం భక్తిశ్రద్ధలతో నమాజ్ చేశారు. నెల రోజుల ఉపవాస దీక్షలను పూర్తి చేసుకున్న వీరు ఈద్గాల వద్ద సామూహిక ప్రార్థనలు చేశారు.

రంజాన్ సందర్భంగా జిల్లా అంతటా ముస్లింలు సోమవారం భక్తిశ్రద్ధలతో నమాజ్ చేశారు. నెల రోజుల ఉపవాస దీక్షలను పూర్తి చేసుకున్న వీరు ఈద్గాల వద్ద సామూహిక ప్రార్థనలు చేశారు. అనంతరం పిల్లలు, పెద్దలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పలువురు ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నాయకులు వెళ్లి ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు. వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్‌లో రద్దు చేయాలని కోరుతూ కొందరు నల్లబ్యాడ్జీలతో ప్రార్థనల్లో పాల్గొన్నారు.
- తిరుపతి(కల్చరల్), ఆంధ్రజ్యోతి
Updated Date - Apr 01 , 2025 | 01:09 AM