ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బూత్‌ స్థాయినుంచి పార్టీ పునర్నిర్మాణం

ABN, Publish Date - Jan 16 , 2025 | 01:08 AM

కార్యకర్తలను అన్ని విధాలా ఆదుకుంటాం దొంగ ఓట్ల వ్యవహారాన్ని వదిలిపెట్టేది లేదు చంద్రగిరి ముఖ్యనేతలు, కార్యకర్తల సమావేశంలో లోకేశ్‌

ఎమ్మెల్యే నానితో కలిసి నియోజకవర్గ ముఖ్య నేతలు, కార్యకర్తలతో మాట్లాడుతున్న మంత్రి లోకేశ్‌

తిరుపతి(విద్య)/చంద్రగిరి, జనవరి 15(ఆంధ్రజ్యోతి): బూత్‌ స్థాయి నుంచి పార్టీని పునర్నిర్మిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. వచ్చే నెల నుంచి పార్టీకోసం అధిక సమయం కేటాయిస్తానన్నారు. నారావారిపల్లెలో బుధవారం ఆయన చంద్రగిరి నియోజకవర్గ ముఖ్యనాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. క్లస్టర్‌, గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో ప్రతీఒక్కరూ పార్టీకోసం కొంత సమయం కేటాయించాలని, మరింత చొరవగా పనిచేయాలని సూచించారు. పార్టీ కార్యకర్తలను అన్ని విధాలా ఆదుకుంటామని, క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే పదవులు వస్తాయన్నారు. పార్టీకోసం అహర్నిశలు పాటుపడిన వారికే గత ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చామని గుర్తు చేశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా మనం సేవలందించాలని, అహంకారంగా నడుచుకోకూడదంటూ దిశానిర్దేశం చేశారు. యువగళంలో పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టారో తనకు తెలుసని, తప్పుచేసినవారిని ఎవరినీ వదలేది లేదన్నారు. తిరుపతి పార్లమెంటు పరిధిలో దొంగ ఓట్ల వ్యవహారాన్ని కూడా వదిలిపెట్టేది లేదన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో సభ్యత్వం చాలాబాగా చేశారని నాయకులు, కార్యకర్తలను అభినందించారు. జనవరి ఒకటి నుంచే పార్టీ సభ్యులకు బీమా అమలవుతోందన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇస్తే రూ.5 లక్షల బీమా ఇప్పించే బాధ్యత తనదన్నారు. కార్యకర్తల పిల్లల భవిష్యత్తు కోసం ఒక ప్రణాళిక రూపొందిస్తున్నామని, వారికి స్వయం ఉపాఽధి కల్పించే అవకాశాలపై దృష్టిసారిస్తున్నామని చెప్పారు. అన్ని మండలాల ముఖ్య కార్యకర్తలను కలివిడిగా పలకరిస్తూ, వారి బాగోగులు తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పులివర్తి నాని, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి డాలర్స్‌ దివాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి హేమేంబరధరరావు, పార్టీ మండలాధ్యక్షుడు సుబ్రహ్మణ్యంనాయుడు, ఈశ్వర్‌రెడ్డి, బెల్లంకొండ మురళి, తిరుమలరెడ్డి, నాగరాజనాయుడు, ఇతర నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jan 16 , 2025 | 01:08 AM