ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రెండు కార్లు ఢీ : తొమ్మిది మందికి గాయాలు

ABN, Publish Date - Mar 17 , 2025 | 01:46 AM

చంద్రగిరి మండలం కాశిపెంట్ల వద్ద పూతలపట్టు, నాయుడుపేట జాతీయ రహదారిలో ఆదివారం సాయంత్రం ముందు వెళుతున్న కారును వెనుక వస్తున్న మరో కారు ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర, ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి.

కాశిపెంట్ల సమీపంలో ఢీకొన్న రెండు కార్లు - క్షతగాత్రులను అంబులెన్స్‌లో తరలిస్తున్న దృశ్యం

చంద్రగిరి, మార్చి 16(ఆంధ్రజ్యోతి): చంద్రగిరి మండలం కాశిపెంట్ల వద్ద పూతలపట్టు, నాయుడుపేట జాతీయ రహదారిలో ఆదివారం సాయంత్రం ముందు వెళుతున్న కారును వెనుక వస్తున్న మరో కారు ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర, ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. కడప నుంచి శ్రీనివాసన్‌, మంజునాథ, గీతా, భాగ్యలక్ష్మి, సువార్త, అరవింద్‌కుమార్‌ కారులో కుప్పానికి వెళుతున్నారు. కాశిపెంట్ల సమీపంలో తిరుపతికి చెందిన భువనాదిత్య, వరప్రసాద్‌, సాయికుమార్‌ వ్యక్తిగత పనులపై కారులో చిత్తూరు వైపు వెళుతున్నారు. అదుపుతప్పి ముందు వెళుతున్న కారును ఢీకొట్టారు. దీంతో ముందు వెళుతున్న కారు టైరు పంక్చరై పక్కనున్న కల్వర్టును ఢీకొంది. అందులోని శ్రీనివాసన్‌, మంజునాథలకు తీవ్ర గాయాలు కాగా, గీతా, భాగ్యలక్ష్మి, సువార్త, అరవింద్‌కుమార్‌ స్వల్పంగా గాయపడ్డారు. మరో కారులోని భువనాదిత్య, సాయికుమార్‌, వరప్రసాద్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హైవే అంబులెన్స్‌ అధికారులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను చంద్రగిరిలోని సీహెచ్‌సీ, తిరుపతి రుయాకు తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Mar 17 , 2025 | 01:46 AM