ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆ ‘భూసేకరణ’ను తేల్చండి

ABN, Publish Date - Jan 11 , 2025 | 04:20 AM

జగనన్న ఇంటిస్థలాల భూ సేకరణలో నాడు వైసీపీ నేతలు చేసిన దోపిడీని బయటపెట్టేందుకు కూటమి సర్కారు చర్యలు ప్రారంభించింది.

ఏ సమాచారమూ దాచడానికి లేదు.. విజిలెన్స్‌ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు

జగనన్న ఇంటిస్థలాల భూ సేకరణలో నాడు వైసీపీ నేతలు చేసిన దోపిడీని బయటపెట్టేందుకు కూటమి సర్కారు చర్యలు ప్రారంభించింది. తొండలు గుడ్లు పెట్టని బీడును కారుచౌకగా కొని రూ. కోట్లకు ప్రభుత్వానికి అంటగట్టిన వ్యవహారం ఇది. ఈ దందాపై విజిలెన్స్‌ విచారణకు కూటమి ప్రభుత్వం ఆదేశించింది. విచారణ కు అవసరం ఉన్న ఏ డాక్యుమెంట్‌, ఆధారం అడిగినా విజిలెన్స్‌కు అందించాలని జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.

ఆనాడు జగనన్న ఇంటి స్థలాలకు

భూసేకరణలో భారీ గోల్‌మాల్‌

బీడు భూములను కారుచౌకగా కొని,

రూ.కోట్లకు అప్పటి సర్కారుకు అమ్మకం

ఆనాడే కలకలం రేపిన వైసీపీ దందా

అధికారంలోకి రాగానే కూటమి దృష్టి

అవసరం ఉన్న ప్రతి రికార్డునూ

విజిలెన్స్‌ అధికారులకు అందివ్వాలి

కలెక్టర్లకు సర్కారు దిశానిర్దేశం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

త జగన్‌ ప్రభుత్వంలో నవరత్నాల కింద జగనన్న ఇంటిస్థలాల పంపిణీ కార్యక్రమాన్ని ఒక తంతులా నడిపించారు. 30 లక్షల మందికి ఇంటిస్థలాలు ఇచ్చామని జగన్‌ గొప్పగా చెప్పుకొన్నారు. తాము ఇళ్లు కాదు...ఏకంగా కాలనీలు, గ్రామాలనే నిర్మిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ పేరిట 26 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని వాడారు. అదనంగా మరో 32వేల ఎకరాల ప్రైవేటు భూమిని కొనుగోలు చేశారు. ఇందుకోసం 18వేల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టారు. అయితే, భూ సేకరణలో భారీ గోల్‌మాల్‌ జరిగినట్టు అప్పట్లోనే కలకలం రేగింది. తొండలు గుడ్లుపెట్టని భూములు, కనీసం పంటకు ఏమాత్రం రాని బీడు భూములను వైసీపీ నేతలు కారుచౌకగా కొని ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ధరలకు అంటగట్టారు. ఈ ప్రక్రియకు నాటి రెవెన్యూశాఖ అధికారులు, కొందరు కలెక్టర్లు, ఆర్డీవోలు, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించారు. ఎకరా రెండు లక్షలు చేయని భూమిని వైసీపీ నేతలు కొని, దాన్నే ప్రభుత్వానికి రెండు కోట్ల చొప్పున అంటకగట్టిన ఉదంతాలు కోకొల్లలు. పరిహారం ముసుగులో వైసీపీ నేతలు కోట్లాది రూపాయలు దండుకున్నారు. రెవెన్యూశాఖలో నాటి ఓ కీలక అధికారి, ఎనిమిది మంది ఐఏఎస్‌ అధికారులు ( కలెక్టర్‌. జేసీ), 28 మంది ఆర్‌డీవోల (డిప్యూటీ కలెక్టర్‌) పాత్రపై అనేకానేక ఆరోపణలు వచ్చాయి. నాటి జగన్‌ మంత్రులు, కొందరు ఎంపీల పాత్రపై అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి.


ఇదీ నేపథ్యం..

కూటమి ప్రభుత్వం వచ్చాక జగనన్న ఇంటిస్థలాల రిపోర్టులను పరిశీలన చేయగా, నేటికీ 9 లక్షల మంది లబ్ధిదారులు ఇంటిపట్టాలు తీసుకోలేదు. జగన్‌ చెప్పిన 30 లక్షల జాబితాలోనిదే ఈ సంఖ్య. ఇదిగాక, మరో 3.64 లక్షల మంది అనర్హులకు కూడా ఇంటిపట్టాలు ఇచ్చారన్న ఫిర్యాదులు ఉన్నాయి. వీటిపై క్షేత్రస్థాయిలో ప్రాఽథమిక విచారణ చేసినప్పుడు భూముల కొనుగోలులో జరిగిన అక్రమాలు బయటపడ్డాయి. దీనిపై ఇటీవలే గృహనిర్మాణశాఖ, విజిలెన్స్‌ విభాగాలు ప్రభుత్వానికి నివేదించాయి. ఈ నేపఽథ్యంలో ఇక ఈ అంశంపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రభుత్వం.....విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాన్ని ఆదేశించింది.

షాక్‌ ఇచ్చిన ‘విశాఖ’ నివేదిక

గతంలో జరిగిన భూమి రికార్డుల పున:పరిశీలన కార్యక్రమంలో కొందరు కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు విచారణ బృందాలకు సహకరించలేదు. అవసరం ఉన్న నివేదికలు అందించలేదు. దీంతో కీలకమైన విశాఖ జిల్లాలో అసైన్డ్‌, గ్రామకంఠం భూముల విషయంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, అత్యంత పారదర్శకంగానే రికార్డులున్నాయని నివేదికలు ఇచ్చారు. అసలు అక్రమాలకు విశాఖ జిల్లానే అడ్డాగా ఉందని ప్రభుత్వం భావిస్తుంటే, అక్కడ ఏ తప్పు జరగలేదని ఆ జిల్లా కలెక్టర్‌ నివేదికలు పంపడం ప్రభుత్వాన్ని షాక్‌నకు గురిచేసింది. ఈ అనుభవం నేపఽథ్యంలో జగన న్న ఇంటిస్థలాలపై జరిగే విచారణకు ప్రతి కలెక్టర్‌, రెవెన్యూ అధికారి అంటే.... ఆర్‌డీవో, తహసిల్థార్‌, ఇతర అధికారులు సహకరించాలని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ఆదేశాలు జారీ చేశారు. ‘‘జగనన్న ఇంటిస్థలాల కాలనీల కోసం 2019-2024 కాలంలో జరిగిన భూ సేకరణపై ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. అయితే, విచారణలో క్రియాశీలకంగా పాల్గొంటున్న అధికారులకు సరైన సమాచారం, సహకారం అందించాలి. వారు కోరిన డాక్యుమెంట్లు, నివేదికలు అందించాలి. ఈ విషయంలో ఏ అధికారి అయినా విజిలెన్స్‌కు సహకరించకపోయినా, ఉద్దేశపూర్వకంగా సహాయనిరాకరణకు దిగినా కఠినచర్యలు తప్పవు’’ అని సిసోడియా తన ఆదేశాల్లో హెచ్చరించారు.

Updated Date - Jan 11 , 2025 | 04:20 AM