కూలిపోయిన రైవాడ కాలువ కల్వర్టు
ABN, Publish Date - Jan 12 , 2025 | 11:30 PM
మండలం లోని బల్లంకి-ఆనందపురం రహదారిలో రైవాడ కాలు వపై ఉన్న కల్వర్టు ఆదివారం కూలిపోయింది. కాలువ నిర్మించి దశాబ్దాలు గడుస్తున్నా కనీస మరమ్మ తులు లేవు.
వేపాడ జనవరి 12 (ఆంధ్రజ్యోతి): మండలం లోని బల్లంకి-ఆనందపురం రహదారిలో రైవాడ కాలు వపై ఉన్న కల్వర్టు ఆదివారం కూలిపోయింది. కాలువ నిర్మించి దశాబ్దాలు గడుస్తున్నా కనీస మరమ్మ తులు లేవు. దీంతో కాలువ పూర్తిస్థాయిలో శిథిలావస్థకు చేరుకుంది.ఈ నేపథ్యంలో ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదముందని పలుసార్లు మొర పెట్టుకున్నా జీవీఎంసీ అధికారులు పట్టించుకోలేదని బల్లంకి, బానాది, ఎం.సిం గవరం గ్రామస్థులు వాపోయారు. జీవీఎంసీ అధికారులు స్పం దించి కూలిపోయిన కల్వర్టు స్ధానంలో కొత్తది నిర్మించి, రాకపోకలను పునరుద్దరించాలని ఆయా గ్రామాల ప్రజలు సూచించారు. తొలుత తాత్కాలికంగా రాకపోకలకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Updated Date - Jan 12 , 2025 | 11:31 PM