Share News

Imran Pratapgarhi: రాజ్యాంగాన్ని బలహీనపర్చేందుకు మతశక్తుల కుట్ర

ABN , Publish Date - Apr 14 , 2025 | 03:17 AM

విజయవాడలో మతసామరస్య సదస్సులో ఇమ్రాన్ ప్రతాప్‌ఘడి మాట్లాడుతూ రాజ్యాంగంపై మతోన్మాద శక్తుల కుట్రలు జరుగుతున్నాయని, మైనారిటీల హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

Imran Pratapgarhi: రాజ్యాంగాన్ని బలహీనపర్చేందుకు మతశక్తుల కుట్ర

మైనారిటీలపై బీజేపీ కక్ష సాధింపు చర్యలు

మతసామరస్యంపై జాతీయ సదస్సులో వక్తల ధ్వజం

విజయవాడ, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): మతోన్మాద శక్తులు రాజ్యాంగాన్ని బలహీనపరిచేందుకు కుట్రలు చేస్తున్నాయని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్‌ మైనారిటీ విభాగం జాతీయ అధ్యక్షుడు ఇమ్రాన్‌ ప్రతా్‌పఘడి విమర్శించారు. దేశం రాజ్యాంగ పునాదులపై నిర్మితమైందని, సమైక్యత, శాంతిని కోరుకునే ప్రజలు వారి ఆటలను సాగనివ్వరన్నారు. సొసైటీ ఫర్‌ కమ్యూనల్‌ హార్మోనీ ఆధ్వర్యంలో సమైక్యతా శంఖారావం పేరుతో మతసామరస్యంపై జాతీయ సదస్సును విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తొలుత మహాత్మాగాంధీ, జ్యోతిరావుపూలే, అంబేడ్కర్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇమ్రాన్‌ ప్రతా్‌పఘడి మాట్లాడుతూ దేశంలో విద్వేష వాతావరణం రోజురోజుకు పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ శక్తులు దేశ శాంతి, సమగ్రతలను విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. వక్ఫ్‌ చట్టం ద్వారా మైనారిటీల ఆస్తుల ఉనికి ప్రశ్నార్థకమైందని తెలిపారు. ముస్లింలు, మైనారిటీలు ఈ చట్టానికి వ్యతిరేకంగా చైతన్యవంతం కావాలన్నారు. సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్‌ మాట్లాడుతూ రాజ్యాంగం దేశానికి ఆయువుపట్టు అన్నారు. రాజ్యాంగం విలువలను, మౌలిక స్వభావాన్ని, స్వరూపాన్ని యధాతథంగా నిలుపుకోవాలని సూచించారు. దేశంలోని నియంతలకు హిట్లర్‌కు పట్టిన గతి పడుతుందని, ఆ రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత తులసిరెడ్డి మాట్లాడుతూ ఆధునిక మానవుడు కులం, మతం, ప్రాంతం మధ్య అడ్డుగోడలు నిర్మించుకుని అశాంతితో జీవిస్తున్నాడన్నారు. కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్‌ మాజీ మంత్రి మొయిద్‌ అహ్మద్‌, కాంగ్రెస్‌ నేత కె.విజయరావు, పీసీసీ ఉపాధ్యక్షుడు కొలనుకొండ శివాజీ తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

IAS Officers Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ

AB Venkateswara Rao: కోడికత్తి శ్రీనుతో ఏబీ వెంకటేశ్వరరావు భేటీ.. వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు

Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం..

TTD Board chairman: భూమనపై టీటీడీ బోర్డ్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు

For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 14 , 2025 | 03:17 AM