షాదీమహాల్ నిర్మాణాలు చేపడతాం: ఎమ్మెల్యే
ABN, Publish Date - Feb 10 , 2025 | 12:32 AM
నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో ముస్లిం మైనార్టీల కోసం షాదీమహాల్ నిర్మాణాలు వచ్చే యేడాది లోపు నిర్మిస్తామని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు

తనకల్లు, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో ముస్లిం మైనార్టీల కోసం షాదీమహాల్ నిర్మాణాలు వచ్చే యేడాది లోపు నిర్మిస్తామని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. మండల కేంద్రానికి సమీపంలోని మండ్లిపల్లి మిట్ట వద్ద ఉన్న ఎస్‌ఎంఎన ఫంక్షన హాల్‌లో ఆదివారం నిర్వహించిన ముస్లిం, మైనార్టీల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. తనకల్లు, కొక్కంటి క్రాస్‌లోని షాదీమహాల్ ఎక్కడ నిర్మించాలో నిర్ణయిం చుకోవాలన్నారు. సమావేశానికి హాజరైన మైనార్టీలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు కోర్తికోట మాజీ సర్పంచ, టీడీపీ నాయకుడు ఎస్‌కె మస్తానవలీ భోజన వసతి ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో ముత్తావ లీలు సుబహాన, హజీత ఫకృద్దీనసాబ్, రెడ్డిబాషా, మౌజన్లు పాల్గొన్నారు.
Updated Date - Feb 10 , 2025 | 12:32 AM