AP High Court : సజ్జల భూములపై ప్రారంభమైన సర్వే
ABN, Publish Date - Feb 21 , 2025 | 06:17 AM
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం ఆక్రమణలో ఉన్న భూములపై గురువారం సర్వే ప్రారంభించారు.

కడప, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): కోర్టు ఆదేశాల మేరకు కడప నగర శివారులోని సీకేదిన్నె మండలంలో వివిధ సర్వే నంబర్లలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం ఆక్రమణలో ఉన్న భూములపై గురువారం సర్వే ప్రారంభించారు. అటవీ భూములను ఆక్రమించి తమ భూముల్లో కలిపేసుకుని సజ్జల ఎస్టేట్ ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి ఏబీఎన్ వెలుగులోకి తెచ్చింది. ఇక్కడ మొత్తం 180 ఎకరాల భూములు ఉన్నాయి. ఇందులో 52 ఎకరాలు అటవీశాఖ భూములని రెవెన్యూ అధికారులు గతంలోనే నిర్ధారించారు. దీనిపై సజ్జల కుటుంబీకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రెవెన్యూ, ఫారెస్టు సర్వే బృందాలతో కమిటీ ఏర్పాటుచేసి నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
Updated Date - Feb 21 , 2025 | 06:17 AM