Axis Power Deal: జగన్ బాటలోనే చంద్రబాబు
ABN, Publish Date - Apr 05 , 2025 | 03:11 AM
ఏపీ కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ బాటలోనే నడుస్తోందని సీపీఎం ఆరోపించింది. యాక్సిస్ పవర్ ఒప్పందంతో ప్రజలపై ఇంధన భారం పెరుగుతుందని ఈఆర్‌సీని ప్రతిపాదనను తిరస్కరించాలని డిమాండ్ చేసింది.

అధిక ధరలకు విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలకు సిద్ధం
యాక్సి్‌సతో అగ్రిమెంట్లను రద్దు చేయాలి: సీహెచ్ బాబూరావు
అమరావతి, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వ బాటలోనే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నడుస్తోందని సీపీఎం ఆరోపించింది. కర్నూలులో శుక్రవారం యాక్సిస్ పవర్‌తో డిస్కమ్‌లు కొనుగోలు ఒప్పందాన్ని చేసుకుంటున్న తరుణంలో ప్రజాభిప్రాయ సేకరణను ఏపీఈఆర్‌సీ చేపట్టింది. ఈ సందర్భంగా సీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ ఒప్పంద ప్రతిపాదనలను ఈఆర్‌సీ తిరస్కరించాలని కోరారు. అదేవిధంగా రూ.15,485 కోట్ల ఇంధన సర్దుబాటు భారాన్ని రద్దు చేయాలని ఈఆర్‌సీని కోరారు. సెకీ, అదానీ ఒప్పందాలను రద్దు చేసే చిత్తశుద్ధిని కూటమి ప్రభుత్వం ప్రదర్శించాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి
Borugadda Anil: రాజమండ్రి నుంచి అనంతపురానికి బోరుగడ్డ.. ఎందుకంటే
Kasireddy shock AP High Court: లిక్కర్ స్కాంలో కసిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
Read Latest AP News And Telugu News
Updated Date - Apr 05 , 2025 | 03:11 AM