ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మునగ చెట్ల నరికివేత

ABN, Publish Date - Jan 13 , 2025 | 11:49 PM

కొన్నేళ్లుగా వివాదాస్పదంగా ఉన్న కొలిమిగుండ్ల మండలం చింతలాయపల్లె గ్రామానికి చెందిన సంజీవకుమార్‌రెడ్డి పొలంలో సాగు చేసిన 400 మునగ చెట్లను గ్రామా నికి చెందిన కొందరు వ్యక్తులు నరికివేశారు.

నరికిన చెట్లను పరిశీలిస్తున్న జడ్పీ చైర్మన ఎర్రబోతుల పాపిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని

కొలిమిగుండ్ల, జనవరి 13 (ఆంధ్రజ్యోతి) : కొన్నేళ్లుగా వివాదాస్పదంగా ఉన్న కొలిమిగుండ్ల మండలం చింతలాయపల్లె గ్రామానికి చెందిన సంజీవకుమార్‌రెడ్డి పొలంలో సాగు చేసిన 400 మునగ చెట్లను గ్రామా నికి చెందిన కొందరు వ్యక్తులు నరికివేశారు. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకోగా సోమవారం మండలంలో తీవ్ర చర్చనీయాంశంగా మా రింది. పంట చేతికొచ్చే సమయంలో ఇలా చేశారని రూ.10లక్షకు పైగా నష్టం వాటిల్లినట్లు రైతు సంజీవకుమార్‌రెడ్డి వాపోయాడు. వివరాలు ఇలా ఉన్నాయి. అబ్దులాపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్‌ 88-1బి, 2,3 7.50 ఎకరాల పొలంపై చాలా కాలంగా వివాదం నడుస్తోంది. నీలం సంజీవకుమార్‌రెడ్డి సాగులో ఉన్నప్పటికీ, చట్ట ప్రకారం తమదేనంటూ అదే గ్రామానికి చెందిన దూదేకుల దస్తగిరి కుటుంబం వాదిస్తున్నారు. ఇటీవలే దూదేకుల దస్తగిరికే పొలం చెందుతుందని కోర్టు తీర్పునిచ్చింది. అయితే సంజీవకుమార్‌రెడ్డి ఇప్పటికే సుమారు రూ.20లక్షల వరకు పెట్టుబడి పెట్టి సాగులో ఉండటంతో అధికారులు దీన్ని ఎలా పరిష్కరించాలన్న ఆలోచన సాగిస్తున్నారు. ఈసమయంలోనే పొలంలోని మునగ చెట్లు నరికి వేయడంతో చర్చనీయాంశంగా మారింది. విషయం తెలిసిన వెంటనే కొలిమిగుండ్ల సీఐ రమేష్‌బాబు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రాథమిక దర్యాప్తు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు.

టీడీపీ నాయకుల ప్రోద్బలంతోనే..

వైసీపీ నాయకుడికి చెందిన మునగ చెట్లు టీడీపీ నాయకుల ప్రోద్బలంతోనే నరికి వేశారని జిల్లా పరిషత చైర్మన ఎర్రబోతుల పాపిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి విమర్శించారు. చెట్లు నరికివేసిన పొలాన్ని పరిశీలించారు.

Updated Date - Jan 13 , 2025 | 11:49 PM