Share News

Dalit driver: ఏడు నెలలుగా మంచానికే పరిమితం

ABN , Publish Date - Apr 03 , 2025 | 04:47 AM

శ్రీసత్యసాయి జిల్లా కారు డ్రైవర్‌ వెంకటేశ్‌ వెన్నెముకలో గడ్డతో ఏడు నెలలుగా మంచానికే పరిమితమయ్యాడు. వైద్యం కోసం రూ.2 లక్షలు అవసరమని వైద్యులు చెబుతున్నారు. రేషన్‌ కార్డు లేకపోవడంతో ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పగా, భార్య కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. దాతల సాయం కోరుతున్నారు.

Dalit driver: ఏడు నెలలుగా మంచానికే పరిమితం

వైద్యానికి రూ.2 లక్షలు ఖర్చవుతాయన్న వైద్యులు

ఆరోగ్యశ్రీలో వైద్యానికి రేషన్‌ కార్డు కూడా లేదు

దాతల సాయం కోసం పేద డ్రైవర్‌ ఎదురుచూపు

కనగానపల్లి, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): అతడో దళిత నిరుపేద కారు డ్రైవర్‌. ఏడు నెలలుగా నడవలేక.. కనీసం లేచి నిలుచోలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యాడు. కూలి పనులకు వెళ్తున్న భార్య.. మంచాన పడిన భర్తను, కూతురిని పోషిస్తోంది. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లికి చెందిన కె.వెంకటేశ్‌ కారు డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఆయనకు భార్య పద్మావతి, కూతురు మధుప్రియ ఉన్నారు. ఏడు నెలల కిందట వెంకటేశ్‌ కాళ్లకు వాపులు వచ్చి చచ్చుబడిపోయాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించినా నయం కాలేదు. తోటి డ్రైవర్లు అండగా నిలిచి.. అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. పలు పరీక్షలు చేసిన వైద్యులు... వెన్నెముకలో గడ్డ ఉందని, ఆపరేషన్‌ చేయించుకుంటేనే ఆరోగ్యం మెరుగవుతుందని చెప్పారు. రూ.2 లక్షలకు పైగా ఖర్చవుతుందని తెలిపారు.


అంత డబ్బు ఖర్చుచేసే స్థోమత లేని ఆ కుటుంబం ఇంటికి వచ్చేసింది. నాటి నుంచి భర్త మంచంపై పడి ఉంటే.. భార్య అతడికి సేవలు చేస్తూ.. కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ‘బతుకుతెరువు కోసం కారు కొన్నందుకు నాలుగేళ్ల కిందట వైసీపీ ప్రభుత్వం రేషన్‌ కార్డు తొలగించింది. బాడుగలు సరిగా లేకపోవడం, రేషన్‌ సరుకులు కూడా రాకపోవడంతో.. కారు అమ్మేశాం. రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేస్తే మంజూరు కాలేదు. అది లేకపోవడంతో ఆరోగ్యశ్రీ వర్తించదని చెబుతున్నార’ అని ఆమె కంటతడి పెట్టుకున్నారు. దాతలు సాయం చేస్తే.. భర్తకు వైద్యం చేయించుకుంటానని చెప్పారు.

దాతలు సాయం చేయాల్సిన చిరునామా: కె.పద్మావతి, భర్త: కె.వెంకటేశ్‌..

బ్యాంకు ఖాతా నంబర్‌: 91162528096(ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు), ఐఎ్‌ఫఎస్‌సీ కోడ్‌: ఏపీజీబీ0001085, ఫోన్‌పే నంబర్‌: 7416153998.


ఇవి కూడా చదవండి:

FD Comparison: ఎస్బీఐ vs యాక్సిస్ బ్యాంక్.. వీటిలో ఏ FD బెస్ట్, దేనిలో ఎక్కువ వస్తుంది..

Samsung: శాంసంగ్ ఏసీల్లో సరికొత్త టెక్నాలజీ..స్మార్ట్ థింగ్స్ కనెక్షన్ సహా అనేక సౌకర్యాలు..

Updated Date - Apr 03 , 2025 | 04:47 AM