ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi High Court: జస్టిస్‌ వర్మ బదిలీకి కేంద్రం ఓకే

ABN, Publish Date - Mar 29 , 2025 | 06:11 AM

నోట్ల కట్టల ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్‌ వర్మను అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ చేయాలన్న సుప్రీం కోలీజియం సిఫారసును కేంద్రం ఆమోదించింది. meanwhile, సుప్రీంకోర్టు ఆయనపై నమోదైన పిల్‌ను తోసిపుచ్చింది.

న్యూఢిల్లీ, మార్చి 28: నోట్ల కట్టల వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్‌ వర్మను అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ చేయాలంటూ సుప్రీం కోలీజియం చేసిన సిఫారసుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే, ఆయనకు ప్రస్తుతానికి ఎలాంటి న్యాయపరమైన విధులూ కేటాయించవద్దని అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సుప్రీంకోర్టు సూచించింది. మరోవైపు.. జస్టిస్‌ వర్మ ఇంటి ప్రాంగణంలోని స్టోర్‌రూమ్‌లో సగం కాలిన నోట్లకట్టలు కనిపించిన నేపథ్యంలో ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలుకు ఆదేశించాలంటూ న్యాయవాది మాథ్యూస్‌ జె నెడుంపర వేసిన పిల్‌ను సుప్రీం కోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే సుప్రీం కొలీజియం నియమించిన త్రిసభ్య కమిటీ జరుపుతున్న అంతర్గత విచారణ పురోగతిలో ఉందని ధర్మాసనం గుర్తు చేసింది. అంతర్గత విచారణ అనేది దర్యాప్తు సంస్థలు జరిపే నేర దర్యాప్తునకు పత్ర్యామ్నాయం కాదని, అసలు అది కోర్టు పని కాదని, దాన్ని పోలీసులకు వదిలేయాలని న్యాయవాది నెడుంపర వాదించారు. దీంతో.. ‘‘అంతర్గత విచారణ పూర్తి కానివ్వండి’’ అని జస్టిస్‌ ఓకా సమాధానమిచ్చారు.


Also Read:

42 అడుగుల బోటుపై.. ఓ ఫ్యామిలీ డేరింగ్ స్టెప్..

మోదీజీ... తమిళనాడుతో పెట్టుకోవద్దు

కొత్త ఏడాది మారనున్న రూల్స్.. తెలుసుకోకుంటే మీకే..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Mar 29 , 2025 | 06:11 AM