ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Dwaraka Tirumala: చినవెంకన్నకు 4.32 ఎకరాల భూమి విరాళం

ABN, Publish Date - Mar 27 , 2025 | 04:07 AM

హైదరాబాద్‌కు చెందిన కాకుమాను కోటేశ్వరరావు ద్వారకాతిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయానికి 4.32 ఎకరాలు విరాళంగా ఇచ్చారు. ఈ భూమిపై వచ్చే ఆదాయంతో ఉపాలయ క్షేత్రపాలకుడైన శివయ్యకు రుద్రాభిషేకం, కల్యాణం నిర్వహించాలని కోరారు.

ద్వారకాతిరుమల, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలోని వేంకటేశ్వరస్వామి(చిన వెంకన్న) ఆలయానికి హైదరాబాద్‌కు చెందిన కాకుమాను కోటేశ్వరరావు 4.32 ఎకరాలను విరాళంగా అందజేశారు. 2004లో ద్వారకాతిరుమల మండలం సత్తెన్నగూడెం గ్రామంలో ఆయన 12 ఎకరాలు కొనుగోలు చేశారు. ఆ భూమిలో 4.32 ఎకరాలను ఆలయం పేరిట భీమడోలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో మంగళవారం రిజిస్ట్రేషన్‌ చేయించి, పత్రాలను ఆలయ ఈవో ఎన్వీ సత్యన్నారాయణమూర్తికి బుధవారం అందజేశారు. ఈ భూమిపై వచ్చే ఆదాయంతో ఉపాలయ క్షేత్రపాలకుడైన శివయ్యకు ప్రతి నెలా రుద్రాభిషేకం, కల్యాణం జరిపించాలని కోరారు.


ఇవి కూడా చదవండి:

చిత్రం భళారే విచిత్రం

Yogi Adityanath: యోగి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

కొబ్బరి నీళ్ల కంటే.. మంచి నీళ్లు మేలు.. డాక్టరేంటి ఇలా అన్నాడు..

Updated Date - Mar 27 , 2025 | 04:07 AM