ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ముందే సంక్రాంతి

ABN, Publish Date - Jan 10 , 2025 | 01:03 AM

నేటి నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సంక్రాం తి పండుగ సెలవులు ఇవ్వనుండడంతో గురువారం పలు పాఠశాలల్లో సంక్రాంతి ముందస్తు సంబరాలను నిర్వహించారు. కొవ్వూరు హోలి ఏంజిల్స్‌ పాఠశాలలో కరస్పాండెంటు వలియవీడు నెల్సన్‌ ఆంటోని ఆధ్వర్యంలో జరిగిన సంబరాల్లో భాగంగా విద్యార్థులను నాలుగు గ్రూపులుగా విభజించి పోటీలు జరిపారు.

తాళ్లపూడి మాంటిస్సోరీ పాఠశాలలో సంక్రాంతి సంబరాల దృశ్యం

కొవ్వూరు, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): నేటి నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సంక్రాం తి పండుగ సెలవులు ఇవ్వనుండడంతో గురువారం పలు పాఠశాలల్లో సంక్రాంతి ముందస్తు సంబరాలను నిర్వహించారు. కొవ్వూరు హోలి ఏంజిల్స్‌ పాఠశాలలో కరస్పాండెంటు వలియవీడు నెల్సన్‌ ఆంటోని ఆధ్వర్యంలో జరిగిన సంబరాల్లో భాగంగా విద్యార్థులను నాలుగు గ్రూపులుగా విభజించి పోటీలు జరిపారు. విద్యార్థులు భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను తెలియజేసే విధంగా ముగ్గులు, వివిధ కలాకృతులను తీర్చిదిద్దారు. తల్లిదండ్రుల ఓటింగ్‌ ద్వారా పోటీల్లో విజేతలను ఎంపికచేశారు. అనం తరం కళాశాలలో భోగి మంటలు వేసి, హరిదాసు కీర్తనలతో సం క్రాంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్‌ జెస్సీ నెల్సన్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్థానిక ఏబీఎన్‌ అండ్‌ పీఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌ ఎం.రామ్మోహన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో యాజమాన్యం తరపున తులసీ నిఖిలేష్‌ జ్యోతి ప్రజ్వలన చేసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. కళాశాల ఫౌండర్‌ ప్రిన్సిపాల్‌ ఎన్‌వీ సుబ్బారావు సంక్రాంతి విశిష్టతను విద్యార్థులకు వివరించారు. అధ్యాపకులు, విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి పాల్గొన్నారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ వై.రమేష్‌, అధ్యాపకులు ఎ.రాణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 10 , 2025 | 01:03 AM