టిడ్కో అపార్ట్‌మెంట్ల సమస్యలన్నీ పరిష్కరిస్తాం

ABN, Publish Date - Apr 05 , 2025 | 12:42 AM

పిఠాపురం, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): టిడ్కో అపార్ట్‌మెంట్ల సముదాయాల వద్ద ఉన్న సమస్యలన్నింటి యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తామని ఏపీ టిడ్కో చైర్మన్‌ వేములపాటి అజయకుమార్‌ తెలిపారు. కాకినాడ పిఠాపురం గోర్స రోడ్డులో ఉన్న టిడ్కో అపార్ట్‌మెంట్టలో ఉన్న స మస్యలతో అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బం

టిడ్కో అపార్ట్‌మెంట్ల సమస్యలన్నీ పరిష్కరిస్తాం
పిఠాపురంలో ప్రజలతో మాట్లాడుతున్న ఏపీ టిడ్కో చైర్మన్‌ వేములపాటి అజయకుమార్‌

ఏపీ టిడ్కో చైర్మన్‌ వేములపాటి

ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన

పిఠాపురం, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): టిడ్కో అపార్ట్‌మెంట్ల సముదాయాల వద్ద ఉన్న సమస్యలన్నింటి యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తామని ఏపీ టిడ్కో చైర్మన్‌ వేములపాటి అజయకుమార్‌ తెలిపారు. కాకినాడ పిఠాపురం గోర్స రోడ్డులో ఉన్న టిడ్కో అపార్ట్‌మెంట్టలో ఉన్న స మస్యలతో అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరిస్తూ ఆంధ్రజ్యోతిలో వార్తా కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన అజయకుమార్‌ శుక్రవారం సాయంత్రం అక్కడ పర్యటించారు. అపార్ట్‌మెంట్లవాసులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. నిలిచిపోయిన వాటర్‌ట్యాంకు నిర్మాణ పనులను ప్రారంభించామని తెలిపారు. డ్రైన్‌ సమస్యలకు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనరు కనకారావుకు సూచించారు. పైప్‌లైన్ల లీకేజీలకు మరమ్మతులు నిర్వహిస్తామని చెప్పారు. తక్షణం జంగిల్‌ క్లియరెన్స్‌ చేయిస్తామని తెలిపారు. రాష్ట్రం మొత్తం మీద పిఠాపురంలోనే అ ధిక అక్యుపెన్సీ ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, మున్సిపల్‌ మంత్రి నారాయణ సూచనలకనుగుణంగా జూన్‌ నాటికి 80వేల టిడ్కో గృహాలను లబ్ధిదారులకు నూరుశాతం అప్పగిస్తామని తెలిపారు. వివిధ కారణాలతో ఖాళీ అయిన 10వేల అపార్ట్‌మెంట్లును కేటాయించేందుకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఆయన వెంట పాడా ప్రాజెక్టు డైరెక్టర్‌ ఎ.చైత్రవర్షిణి, మున్సిపల్‌ కమిషనరు కనకారావు, జనసేన నాయకుడు పిల్లా శివశంకర్‌ ఉన్నారు.

Updated Date - Apr 05 , 2025 | 12:42 AM