ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నిధులున్నా.. నత్తనడక!

ABN, Publish Date - Jan 13 , 2025 | 12:58 AM

ఉభయ గోదావరి జిల్లాలను కలిపే నిడదవోలు పట్టణంలో ఆర్వోబీ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం కారణంగా ఏడాదిలో కేవలం సుమారు 40 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి.

పిల్లర్ల స్థాయిలో ఉన్న నిడదవోలు ఆర్వోబీ పనులు

కేంద్రం దారిచూపినా ఇంతే

మంత్రి ఇలాఖాలో ఇదీ పరిస్థితి

కానరాని అధికారుల పర్యవేక్షణ

కన్నెత్తి చూడని పాలకులు

కాంట్రాక్టర్‌ ఇష్టారాజ్యం

40 శాతమే పూర్తయిన ఆర్వోబీ

వ్యాపారులు, ప్రజలకు ఇబ్బందులు

మందకొడిగా పనులు

నిడదవోలు, జనవరి 12 (ఆంధ్రజ్యోతి) : ఉభయ గోదావరి జిల్లాలను కలిపే నిడదవోలు పట్టణంలో ఆర్వోబీ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం కారణంగా ఏడాదిలో కేవలం సుమారు 40 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. సాక్షాత్తూ మంత్రి దుర్గేష్‌ నియోజకవర్గకమైనా కన్నెత్తి చూసిన అధికారులు లేరు..పట్టించుకున్న పాలకులు లే రు.ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్‌ ఇష్టారాజ్యంగా మారిపోయింది.మరో వైపు ప్రజలు నెలల తర బడి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొంత మంది వ్యాపారులైతే తీవ్ర నష్టాల పాలయ్యారు. ప్రధానంగా నిడదవోలు వ్యాపారం అంతా ఈ రహదారి మీదుగానే సాగుతోంది. అటువంటిది ఏడాదికాలంగా ఈ రహదారిపై రైల్వే ఓవర్‌ బ్రిడ్జి పనుల చేపడుతుండడంతో దాదాపు మూ సివేశారు. పక్కన ఉన్న చిన్న చిన్న వీధుల గుండా వాహనదారులు ప్రయాణిస్తున్నారు. ఇది తీవ్ర ఇబ్బంది కరంగా ఉంది.మరో వైపు దుమ్ము, దూళి కారణంగా తెరిచి ఉంచిన దుకాణాలకు ప్రజలు రావడం మానేశారు. దీంతో నిడదవోలు మెయిన్‌రోడ్డు కాస్తా అయోమయంగా మారింది. వాస్తవానికి 2025 డిసెంబరు నాటికి పూర్తిచే యాలని ఆదేశాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పూర్తయ్యేలా కనిపించడం లేదు.

కేంద్రం నిధులిచ్చినా..

ఉభయ గోదావరి జిల్లాల వాహనదారుల ప్రధాన సమస్య నిడదవోలు పట్టణంలోని రైల్వే గేటు.ఈ నేపథ్యంలో గోదావరి జిల్లా వాసుల ఎన్నో ఏళ్ళ కల నిడదవోలు రైల్వే ఓవర్‌ బ్రిడ్జి..ఈ మేరకు 2019 జనవరి 7వ తేదీన నిడదవోలు గాంధీ బొమ్మ సెంటరులో ఆర్వోబీ నిర్మాణానికి నాటి సీఎం చంద్రబాబు చర్యలు చేపట్టారు. పైలాన్‌ ఆవిష్కరించి 18 నెలల్లో ఆర్వోబీ నిర్మాణం పూర్తి కావాలని అధికారులకు ఆదేశిం చారు.రైల్వే రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఆర్వోబీ నిర్మాణం చేపట్టేలా ప్రణాళిక రూపొం దించారు. అనంతరం ఎన్ని కలు రావడం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియలో ఆర్వోబీ నిర్మాణం నిలిచి పోయింది. నాటి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్వోబీ నిర్మాణంపై మాటలే తప్ప చేతలు కరువయ్యాయి.ఇదిలా ఉండగా ఆర్వోబీ నిర్మాణా నికి కేంద్ర ప్రభుత్వం సేతబంధన్‌ స్కీమ్‌ ద్వారా దారి చూపింది. కేంద్ర ప్రభుత్వం చొరవతో ఆర్వోబీ నిర్మాణానికి కేంద్రం దారి చూపుతుం దంటూ గతేడాది ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచు రితమైంది.అయితే ఏడాదైనా ఆ పనులు మా త్రం నత్తతో పోటీపడుతున్నాయి. ఇప్పటికే ఆర్వో బీ నిర్మాణ స్థల సేకరణకు సంబంధించి కొంత మంది యజమానులకు సొమ్ములు వారి ఖాతా లకు జమయ్యాయి.తహశీల్దార్‌ కార్యాలయం వైపు కొన్ని నివాసాలకు సంబంధించి యజ మానులకు ఇంకా సొమ్ము చెల్లించలేదు. దీంతో ఇప్పటి వరకూ గృహాలు తొలగించ లేదు.ఆ ఫైల్‌ అధికారుల టేబుల్‌పై ఉందని చెబుతున్నారు.

ఈ ఏడాది పూర్తయ్యేనా?

కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆర్వోబీ నిర్మా ణానికి టెండర్లు పిలవడంతో కాంట్రాక్టర్‌ ఖరా రయ్యారు.ఈ నేపథ్యంలో గతేడాది సంక్రాంతి పండుగకు ఆర్వోబీ నిర్మాణ పనులు ప్రారంభ మయ్యాయి.ఈ సంక్రాంతి వచ్చే నాటికి ఆర్వో బీ నిర్మాణ పనులు పూర్తవుతాయని అంతా ఆశించారు. అయితే సిబ్బంది కొరత కారణంగా పనుల్లో మాత్రం వేగం కానరావడంలేదు. నిడ దవోలు పట్టణ ప్రజలకు ఇబ్బందులు తప్ప డంలేదు.ఇప్పటికే ఆర్వోబీ నిర్మాణానికి పిల్లర్లు దాదాపుగా పూర్తయినా స్లాబ్‌ పనులు నిలిచి పోయాయి. వాస్తవానికి 2025 డిసెంబరు నా టికి పూర్తిచేయాలని ఆదేశాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పూర్తయ్యేలా కనిపించడం లేదు.

రూ.201 కోట్ల అంచనా..

ఆర్వోబీ నిర్మాణ వ్యయం అంచనా రూ.201 కోట్లుగా నిర్ణయించారు.భూసేక ర ణకు రూ.21 కోట్లు లెక్కించారు. సేతుబంధన్‌ నిధులు రూ.124 కోట్లు,కేంద్ర రైల్వేశాఖ వాటా రూ.56 కోట్లుగా తేల్చారు. నిడదవోలులో 38 మంది, సమిశ్రగూడెంలో 13 మంది నుంచి 6.14 ఎకరాలు భూసేకరణ చేశారు. ఇం దులో ప్రభు త్వ భూమి 5.11 ఎకరాలు ఉండగా.. ప్రైవేటు భూమి 1.03 ఎకరాలు. అయితే తహశీల్దార్‌ కార్యాలయం వద్ద కొంత మేర భూసేకరణ చేపట్టలేదు. ప్రస్తుతం సమస్యగా ఉంది.

Updated Date - Jan 13 , 2025 | 12:58 AM