ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కాలువలు మూసివేస్తారా..? నీటి విడుదల పొడిగిస్తారా!

ABN, Publish Date - Apr 16 , 2025 | 01:19 AM

డెల్టా కాలువలు మూసివేస్తారా.. లేక నీటి విడుదల పొడిగిస్తారా అనే దానిపై సందిగ్దత నెలకొంది.

ధవళేశ్వరం, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): డెల్టా కాలువలు మూసివేస్తారా.. లేక నీటి విడుదల పొడిగిస్తారా అనే దానిపై సందిగ్దత నెలకొంది. రబీ అనంతరం ఖరీ ఫ్‌ సీజన్‌లో నీటి సరఫరా సక్రమంగా జరిగేందుకు క్లోజర్‌ పనులు చేపట్టేందుకు డెల్టా కాలువలను బుధవారం నుంచి మూసివేయాలని ఇరిగేషన్‌ అధికారులు గతంలోనే నిర్ణయించారు. అయితే శివా రు ఆయకట్టు భూములకు ఇంకా నీటి అవసరత ఉండడం, గ్రామాల్లో తాగునీటి చెరువులు నింపుకోవడం తదితర పను లు పూర్తిస్థాయిలో జరగలేదు. రబీ అవ సరాలు తగ్గిన తరువాత గ్రామాల్లో తాగునీటి చెరువులు నింపుకోవడానికి మరో నాలుగైదు రోజులు కాల్వలకు నీరు విడుదల చేస్తారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ ఎటువంటి సమాచారం లేదు.

నేడు కాలువలు మూసివేస్తాం..

సర్కిల్‌ ఎస్‌ఈ గోపినాథ్‌

డెల్టా కాల్వలను నిర్ణయించిన తేదీ మేరకు బుధవారం నుంచి మూసివేయనున్నాం. కాల్వలకు నీటి విడుదల పొడిగింపునకు ఎటువంటి అభ్యర్థనలు రాలే దు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు ఇంత వరకు అందలేదు. కాలువలకు నీటి విడు దల నిలుపుదల చేయాలని నిర్ణయించడంతో కాల్వలను మూసివేసేందుకు ఇరిగేషన్‌ సిబ్బంది సిద్ధంగా ఉండాలి.

Updated Date - Apr 16 , 2025 | 01:19 AM