ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సత్యదేవునికి ప్రముఖుల పూజలు

ABN, Publish Date - Jan 02 , 2025 | 01:04 AM

అన్నవరం, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): కాకి నాడ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో బుధవారం నూతన ఆంగ్ల సంవత్సరం పురస్కరించుకుని

దర్శనానంతరం ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు దంపతులు

అన్నవరం, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): కాకి నాడ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో బుధవారం నూతన ఆంగ్ల సంవత్సరం పురస్కరించుకుని పలువురు ప్రముఖులు పూజలు నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు దంపతులు స్వామిని దర్శించుకున్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దంపతులు స్వామివారి వ్రతమాచరించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ దంపతులు స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ ఈవో వీర్ల సుబ్బారావు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. స్వామి దర్శనానంతరం వేదపండితులు వేదాశీర్వచనాలు అందజేశారు. మరోపక్క పలు ప్రాంతాల నుంచి స్వామి దర్శనానికి భక్తులు విచ్చేశారు. ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, ఉచిత దర్శనానికి 3గంటల సమయం భక్తులు వేచి ఉన్నారు. సు మారు 40 వేలమంది స్వామిని దర్శించుకున్నారు.

Updated Date - Jan 02 , 2025 | 01:04 AM