అన్నవరంలో అపూర్వ స్వాగతం

ABN, Publish Date - Mar 19 , 2025 | 12:23 AM

అన్నవరం, మార్చి 18 (ఆంధ్ర జ్యోతి): సమృద్ధి, సంరక్షణ పేరుతో దేశంలో ఉన్న 6500 కిలోమీటర్ల సముద్ర తీరప్రాంత ప్రజల్లో దేశ భద్రత, సమైక్యతను పెంపొందించాలనే ఉద్దేశంతో చేపట్టిన సీఐఎస్‌ఎఫ్‌ (కేంద్ర పారిశ్రామిక భద్రత దళం) చేపట్టిన సైకిల్‌ ర్యాలీకి కాకినాడ జిల్లా అన్నవరంలో అపూర్వ స్వాగతం లభించింది

అన్నవరంలో అపూర్వ స్వాగతం
బృంద సభ్యులకు హారతి ఇస్తున్న మహిళలు

సైకిల్‌ ర్యాలీ చేస్తున్న సీఐఎస్‌ఎఫ్‌ బృందానికి హారతులిచ్చిన మహిళలు

అన్నవరం, మార్చి 18 (ఆంధ్ర జ్యోతి): సమృద్ధి, సంరక్షణ పేరుతో దేశంలో ఉన్న 6500 కిలోమీటర్ల సముద్ర తీరప్రాంత ప్రజల్లో దేశ భద్రత, సమైక్యతను పెంపొందించాలనే ఉద్దేశంతో చేపట్టిన సీఐఎస్‌ఎఫ్‌ (కేంద్ర పారిశ్రామిక భద్రత దళం) చేపట్టిన సైకిల్‌ ర్యాలీకి కాకినాడ జిల్లా అన్నవరంలో అపూర్వ స్వాగతం లభించింది. గ్రామంలోకి చేరుకోగానే సర్పంచ్‌ కు మార్‌రాజా స్వాగతం పలకగా మహిళలు హారతులిచ్చారు. మార్చి 7న పశ్చిమబెంగాల్‌ బికిలీ నుంచి 60మంది సీఐఎస్‌ఎఫ్‌ దళంతో ప్రారంభమైన ఈ సైకిల్‌ యాత్ర 2700 కిలోమీటర్ల సాగి కన్యాకుమారితో ముగుస్తుందని బృందం పేర్కొంది. ఈ దళం ఏర్పాటై మార్చి 10 నాటికి 55 ఏళ్లు పూర్తిచేసుకుందన్నారు. మంగళవారం రాత్రికి అన్నవరం సత్యదేవుని సన్నిధిలో బసచేసి బుధవారం ర్యాలీ ప్రారంభిస్తామన్నారు.

Updated Date - Mar 19 , 2025 | 12:23 AM