ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గంజాయి రవాణా చేస్తున్న నలుగురి అరెస్ట్‌

ABN, Publish Date - Jan 04 , 2025 | 12:47 AM

జగ్గంపేట, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): గంజా యి రవాణా చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ వివరాలను శుక్రవారం జగ్గం పేట పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయం వద్ద జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ఈనెల 31న కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామం టోల్‌గేట్‌ వద్ద గంజాయి తరలిస్తున్నారని సమాచారం రావడంతో అర్ధరాత్రి వేళ టోల్‌ప్లాజ్‌ వద్ద సీఐ వైఆర్‌కె శ్రీనివాసరావు, కిర్లంపూడి ఎస్‌ఐ సతీష్‌ బృందంతో కలిసి యూపీ81 బీడీ4

జగ్గంపేటలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

రూ.3.42 లక్షల విలువైన 68.6 కిలోల గంజాయి, కారు, సెల్‌ఫోన్‌ స్వాధీనం

జగ్గంపేట, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): గంజా యి రవాణా చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ వివరాలను శుక్రవారం జగ్గం పేట పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయం వద్ద జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ఈనెల 31న కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామం టోల్‌గేట్‌ వద్ద గంజాయి తరలిస్తున్నారని సమాచారం రావడంతో అర్ధరాత్రి వేళ టోల్‌ప్లాజ్‌ వద్ద సీఐ వైఆర్‌కె శ్రీనివాసరావు, కిర్లంపూడి ఎస్‌ఐ సతీష్‌ బృందంతో కలిసి యూపీ81 బీడీ4243గల కారు ను ఆపగా ఆపినట్టే ఆపి ఒక్కసారిగా వేగంగా నడపడంతో అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ లోవరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటకే కాకినాడ మెడికోవర్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే కానిస్టేబుల్‌ ఇచ్చిన ఫిర్యా దు మేరకు కిర్లంపూడి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఆ కారు లో గంజాయి ఉన్నట్టు సమాచారం అందింది. దీంతో పోలీసులు నిందితుల కోసం గాలించగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన తరుణ్‌కుమార్‌, జాహిద్‌, ముస్తాకిమ్‌, మహ్మద్‌ జాఖీర్‌ఖాన్‌ను శుక్రవారం కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామం పోలవరం కాలువ వద్ద కారుతో అదుపులోకి తీసుకున్నారు. గంజాయిని పాడేరు ఏజెన్సీ ప్రాంతం నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఆలీ ఘడ్‌కు తరలిస్తుండగా పోలీసులు పట్టుకు న్నారు. రూ.3.42 లక్షల విలువైన 68.6 కిలోల గంజాయి, రూ.20.5 లక్షలు విలువైన కారు, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. నింది తుల ను పట్టుకునేందుకు ఎంతో కృషి చేసిన జగ్గంపేట సీఐ వైఆర్‌కె శ్రీనివాస్‌, కిర్లంపూడి ఎస్‌ఐ సతీష్‌, క్రైం హెచ్‌సీ జె.నాగరాజు, కానిస్టేబుల్‌ ఆర్‌.లోవరాజు, టీఎస్‌ దుర్గాప్రసాద్‌, ఎ.జయ రాం, హోంగార్డు ప్రసాద్‌, గిరిలను ఎస్పీ అభిన ందించారు. విధి నిర్వహణలో గాయపడిన కాని స్టేబుల్‌ లోవరాజును పరామర్శించారు. లోవరాజు భార్య, కుటుంబ సభ్యులకు ఎస్పీ ధైర్యం చెప్పి వైద్యానికి అయ్యే ఖర్చు అంతా పోలీస్‌ శాఖ భరిస్తుందని ధైర్యంగా ఉండాలన్నారు.

Updated Date - Jan 04 , 2025 | 12:47 AM