ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సింహ వాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు

ABN, Publish Date - Jan 02 , 2025 | 01:11 AM

తూర్పు తిరుమల గా పేరొందిన బలభద్రపురం శ్రీదేవి, భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వరస్వామి ద్వితీయ బ్రహ్మోత్సవాలు బుధవారం తొమ్మిదవ రోజుకు చేరాయి. ఉదయం సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభించి సహస్ర కలశాభిషేకం, సుగంధ పుష్పాభిషేకం, మార్గ శీర్ష వ్రతం కార్యక్రమాలు జరిపారు.

సింహ వాహనంపై మలయప్పస్వామి అవతారంలో ఊరేగుతున్న శ్రీనివాసుడు..

బిక్కవోలు, జనవరి 1(ఆంధ్రజ్యోతి): తూర్పు తిరుమల గా పేరొందిన బలభద్రపురం శ్రీదేవి, భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వరస్వామి ద్వితీయ బ్రహ్మోత్సవాలు బుధవారం తొమ్మిదవ రోజుకు చేరాయి. ఉదయం సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభించి సహస్ర కలశాభిషేకం, సుగంధ పుష్పాభిషేకం, మార్గ శీర్ష వ్రతం కార్యక్రమాలు జరిపారు. రాత్రి గోవింద నామ స్మరణల మధ్య సింహ వాహనంపై శ్రీమలయ్యప్పస్వామి అవతారంలో స్వామి అమ్మవార్లను మాడ వీధుల్లో ఊరేగించారు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ చైర్మన్‌ మల్లిడి గంగారెడ్డి అన్న ప్రసాదాన్ని ఏర్పాటుచేశారు. ఈ బ్రహ్మో త్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Jan 02 , 2025 | 01:11 AM