ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మహనీయుడు బాబూజీ

ABN, Publish Date - Apr 06 , 2025 | 01:14 AM

విద్యతోనే ఏసమస్యనైనా అధిగమించగలమన్న దృఢసంకల్పంతో దేశ చరిత్రలో తనదైనముద్రవేసుకున్న మహనీయుడు బాబూ జగ్జీవన్‌రామ్‌ అని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్‌.ప్రసన్నశ్రీ అన్నారు. భారత దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జజీవన్‌రామ్‌ 117వ జయంతిని శనివారం పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నన్నయ వర్శిటీలో ఆయన చిత్రపటానికి వీసీ ప్రసన్నశ్రీ పూలమాల వేసి నివాళులర్పించారు.

దివాన్‌చెరువులో బాబూజీకి నివాళులర్పించిన ఎమ్మెల్యే బత్తుల
  • నన్నయ వర్శిటీ వీసీ ప్రసన్నశ్రీ

  • మాజీ ఉప ప్రధాని జయంతి

  • ఘనంగా నివాళులర్పించిన పలువురు నాయకులు, అధికారులు

దివాన్‌చెరువు, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): విద్యతోనే ఏసమస్యనైనా అధిగమించగలమన్న దృఢసంకల్పంతో దేశ చరిత్రలో తనదైనముద్రవేసుకున్న మహనీయుడు బాబూ జగ్జీవన్‌రామ్‌ అని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్‌.ప్రసన్నశ్రీ అన్నారు. భారత దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జజీవన్‌రామ్‌ 117వ జయంతిని శనివారం పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నన్నయ వర్శిటీలో ఆయన చిత్రపటానికి వీసీ ప్రసన్నశ్రీ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బాబూజీ ఎన్నో పదవులు అధిరోహించి వాటికి వన్నె తీసుకువచ్చారన్నారు. ఆయన హయాంలోనే నాగార్జునసాగర్‌, నిర్మాణం జరిగిందని తెలిపారు. బాబూజీగా ప్రసిద్దికెక్కిన జగ్జీవన్‌రామ్‌ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. మహనీయుల జీవితచరిత్రలను తల్లిదండ్రులు, అధ్యాపకులు విద్యార్థులకు బోధిస్తూ ఉండాలని అన్నారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు. అలాగే దివాన్‌చెరువులో జరిగిన కార్యక్రమంలో బాబూ జగ్జీవన్‌రామ్‌, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ విగ్రహాలకు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల సంక్షేమం కోసం బాబూజీ చేసిన కృషిని వివరించారు. అలాగే పాతతుంగపాడు, నామవరం, కొండగుంటూరు గ్రామాల్లో జరిగిన కార్యక్రమాలకు రుడా చైర్మన్‌ బొడ్డు వెంకటరమణచౌదరి విచ్చేసి బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహాలకు పూలమాలలతో నివాళులర్పించారు. స్వాతంత్య్ర సమర యోధుడిగా, ఉపప్రధానిగా దేశసేవకు అంకితమైన బాబూ జగ్జీవన్‌రామ్‌ జీవితం స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. కేక్‌ కట్‌ చేసి పంచారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2025 | 01:14 AM