నేటి నుంచి కాకినాడలో ఇండో-అమెరికా సైనిక విన్యాసాలు

ABN, Publish Date - Apr 08 , 2025 | 12:41 AM

సర్పవరం జంక్షన్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): కాకినాడ సాగర తీరంలో ఈ నెల 8 నుంచి 13 వరకు జరిగే ఇండో-అమెరికా సైనిక విన్యాసాల టైగర్‌ ట్రయాంఫ్‌-25 కోసం 130 మంది పోలీసులతో కట్టుదిట్టమైన పటిష్ట భద్రతా బందోబస్తు ఏర్పాట్లు చేపట్టినట్టు కాకినాడ ఎస్‌డీపీవో దేవరాజ్‌ మనీష్‌ పాటిల్‌ తెలిపారు. సోమ

నేటి నుంచి కాకినాడలో ఇండో-అమెరికా సైనిక విన్యాసాలు
సూర్యారావుపేట బీచ్‌లో బందోబస్తు ఏర్పాట్లపై మాట్లాడుతున్న ఎస్‌డీపీవో దేవరాజ్‌ మనీష్‌ పాటిల్‌, ట్రైనీ ఏఎస్పీ సుస్మిత, సీఐ చైతన్యకృష్ణ

130 మంది పోలీసులతో బందోబస్తు

ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎస్‌డీపీవో

సర్పవరం జంక్షన్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): కాకినాడ సాగర తీరంలో ఈ నెల 8 నుంచి 13 వరకు జరిగే ఇండో-అమెరికా సైనిక విన్యాసాల టైగర్‌ ట్రయాంఫ్‌-25 కోసం 130 మంది పోలీసులతో కట్టుదిట్టమైన పటిష్ట భద్రతా బందోబస్తు ఏర్పాట్లు చేపట్టినట్టు కాకినాడ ఎస్‌డీపీవో దేవరాజ్‌ మనీష్‌ పాటిల్‌ తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన సూర్యారావుపేట బీచ్‌లో సీఐ డీఎస్‌ చైతన్యకృష్ణ ఆధ్వర్యంలో ఎస్‌ఐ లు, ఏఎస్‌ఐలు, హెచ్‌సీ, పీసీలతో బందోబస్తు ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. సైనిక విన్యాసాలు జరిగే రోజుల్లో మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు నిషేధిత ప్రాంతాల్లోకి రాకూడదన్నారు. మంగళవారం నుంచి 13వ తేదీ వరకు లైట్‌హౌస్‌ నుంచి ఉప్పాడ వరకు ఎటు వంటి వాహనాలకు ప్రవేశం లేదన్నారు. సైనిక విన్యాసాల్లో పూర్తి అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని ఆయన ఆదేశించారు. బందోబస్తు ఏర్పాట్లు, ఇ రుదేశాల త్రివిధ దళాల అధికారులు, సిబ్బందికి వసతి, ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం సైనిక విన్యాసాలు జరిగే నావెల్‌ ఎన్‌క్లేవ్‌ పరిసర ప్రదేశాలను పరిశీలించారు. తిమ్మాపురం ఎస్‌ఐ, ట్రైనీ ఏఎస్పీ సుస్మిత పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2025 | 12:41 AM