ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం

ABN, Publish Date - Mar 14 , 2025 | 12:50 AM

ఔత్సా హిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకోవాలని పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్‌ శ్రీవాణి ధర రామన్‌ పేర్కొ న్నారు. గోదావరి గ్లోబల్‌ విశ్వవిద్యాలయంలోని మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ విభాగం, విశా ఖపట్నంలోని ఎమ్మెస్‌ ఎంఈ టెక్నా లజీ సెంటర్‌ సంయుక్త ఆఽధ్వర్యంలో గురువారం వ్యవస్థాపక అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
సమావేశంలో మాట్లాడుతున్న జీఎం రామన్‌
  • పరిశ్రమల కేంద్రం జిల్లా జనరల్‌ మేనేజర్‌ శ్రీవాణి ధర రామన్‌

రాజానగరం, మార్చి 13(ఆంధ్రజ్యోతి): ఔత్సా హిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకోవాలని పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్‌ శ్రీవాణి ధర రామన్‌ పేర్కొ న్నారు. గోదావరి గ్లోబల్‌ విశ్వవిద్యాలయంలోని మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ విభాగం, విశా ఖపట్నంలోని ఎమ్మెస్‌ ఎంఈ టెక్నా లజీ సెంటర్‌ సంయుక్త ఆఽధ్వర్యంలో గురువారం వ్యవస్థాపక అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రోచాన్సలర్‌ కె.విజయభాస్కర్‌రాజు అధ్య క్షతన జరిగిన ప్రారంభోత్సవ సభకు జీఎం రామన్‌ ముఖ్యఅతిథి గా విచ్చేసి మాట్లాడారు. మార్కె టింగ్‌ను దృష్టిలో ఉంచుకుని పరిశ్ర మలు స్థాపించి, ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలను వినియోగించుకోవాలన్నారు. పా రిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేసేందుకు భవి ష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం విధాన కార్యక్రమాలను రూపొందించిందన్నారు. విశాఖ లోని భారత ప్రభుత్వ ఎంఎస్‌ ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ ఏఐసీటీఈ కోర్సుల ప్రిన్సిపాల్‌, కీలక రిసోర్స్‌పర్సన్‌ ఆచార్య కె.మురళీకృష్ణ మాట్లాడు తూ భావి పారిశ్రామికవేత్తల కోసం ప్రపంచ స్థాయి వనరులను విశాఖపట్నంలో దాదాపు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వం అందుబా టులోకి తెచ్చిందన్నారు. యువత శిక్షణ పొంద డంతో పాటు ప్రాజెక్టులు కొలాబరేషన్స్‌ వం టివి వీటి ద్వారా చేసుకోవచ్చని చెప్పారు. కార్య క్రమంలో జీజీయూ ప్రిన్సిపాల్‌ టి.జయానందకు మార్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ ఎస్‌వీ ఎస్‌ఎన్‌ మూర్తి, ఎంబీఏ విభాగాధిపతి బీవీఆర్‌ నాయుడు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Mar 14 , 2025 | 12:50 AM