లారీ యూనియన్ల వ్యవస్థ బలోపేతానికి సహకారం : ఎమ్మెల్యే
ABN, Publish Date - Feb 09 , 2025 | 11:28 PM
సర్పవరం జంక్షన్, ఫిబ్రవరి 9 (ఆంధ్ర జ్యోతి): వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ,జిల్లా ప్రగతిలో కీలకపాత్ర పోషిస్తున్న లారీ యూనియన్ల వ్యవస్థ బలోపేతానికి సంపూర్ణ సహకారం అందిస్తానని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా లారీ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికైన దుగ్గ

సర్పవరం జంక్షన్, ఫిబ్రవరి 9 (ఆంధ్ర జ్యోతి): వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ,జిల్లా ప్రగతిలో కీలకపాత్ర పోషిస్తున్న లారీ యూనియన్ల వ్యవస్థ బలోపేతానికి సంపూర్ణ సహకారం అందిస్తానని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా లారీ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికైన దుగ్గన నాగరాజు (బాబ్జీ) ఆధ్వర్యంలో పాటూ 19 యూనియన్ల ప్రతినిధులతో కలసి ఆదివా రం రాత్రి గొడారిగుంటలో ఎమ్మెల్యే నివాసంలో నానాజీని మర్యాద పూర్వకంగా కలుసుకున్నా రు. నూతన అధ్యక్షుడు దుగ్గన బాబ్జీ, ఇతర యూనియన్ల సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. రాజకీయాలకతీతంగా లారీ యూనియను ఉండాలని, గతంలో వైసీపీ నాయకులు ప్రోద్భలంతో దళారులు ప్రవేశించడంతో కంపెనీ యాజమాన్యం, లారీ యాజమానులు తీవ్రంగా నష్టపోయారని, దళారులు బాగుపడ్డారన్నారు. మోటారు రంగం బాగుంటేనే అన్ని రంగాలతో పాటూ అంతా బాగుంటామని, దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. లారీ యాజమానులు, డ్రైవర్ల సంక్షేమం, అభివృద్ధి కోసం జిల్లాలో ఉన్న ఇతర ఎమ్మెల్యేలతో మా ట్లాడి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేను వారు సత్కరించారు. కార్యక్రమంలో యూనియన్ వైస్ ప్రెసిడెంట్ దుర్గారావు, గౌరవాధ్యక్షుడు డి.ఈశ్వరరావు, ఎన్.వెంకసుబ్బారెడ్డి, ఎన్.సత్యనారాయణ, సింగిరెడ్డి రవి,వి.సూర్యనారాయణ పాల్గొన్నారు.
రాజశేఖర్‌ను గెలిపించండి
ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పోటీచేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్‌ని గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టాలని ఎమ్మెల్యే పంతం నానాజీ, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కూడుపూడి సత్తిబాబు కోరారు. ఆదివారం కాకినాడ రూరల్ నేమాం, పండూరు, తిమ్మాపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల పరిశీలకులు సుధాకర్, ఎంపీటీసీ నందిపాటి అనంతలక్ష్మిత్రిమూర్తులు, కూటమి నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, మాదారపు తాతాజీ, కర్రి వెంకట్రాజు, నందిపాటి రమణ, పోసిన రాము, దాసరి శివ, రాందేవు సీతయ్యదొర పాల్గొన్నారు.
Updated Date - Feb 09 , 2025 | 11:28 PM