పండుగకు..పప్పన్నమేది!
ABN, Publish Date - Jan 13 , 2025 | 12:59 AM
సంక్రాంతి పండగ పూట కందిపప్పు అం దక జిల్లాలో రేషన్‌కార్డుదారులు తీవ్ర నిరా శకు గురయ్యారు.నవంబరు నెల నుంచి ప్రతి కార్డు హోల్డర్‌కు రూ. 67కే కేజీ కంది పప్పు ఇస్తున్న సంగతి తెలిసిందే. బయట మార్కెట్‌లో రూ.90 నుంచి రూ.180 వరకూ రకరకాల ధరల్లో విక్రయిస్తున్నారు.
నాణ్యత బాగాలేక తిప్పిపంపిన అధికారులు
నేటికీ 65 శాతం మందికి అందని పప్పు
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
సంక్రాంతి పండగ పూట కందిపప్పు అం దక జిల్లాలో రేషన్‌కార్డుదారులు తీవ్ర నిరా శకు గురయ్యారు.నవంబరు నెల నుంచి ప్రతి కార్డు హోల్డర్‌కు రూ. 67కే కేజీ కంది పప్పు ఇస్తున్న సంగతి తెలిసిందే. బయట మార్కెట్‌లో రూ.90 నుంచి రూ.180 వరకూ రకరకాల ధరల్లో విక్రయిస్తున్నారు. ఈ నేప థ్యంలో ప్రభుత్వం రూ.67కే నాణ్యమైన కం దిపప్పు ఇవ్వడంతో ప్రజలంతా సంతో షించారు.గత వైసీపీ ప్రభుత్వం 2023 నుం చి కందిపప్పు పంపిణీ మానేసింది. పైగా ఎవరూ కందిపప్పు తినడం లేదని ప్రచా రం కూడా చేసింది.కానీ గత ఎన్ని కల్లో ఘన విజయం సాధించిన తెలుగు దేశం నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం గతే డాది నవంబరు నుంచి ప్రతీ కార్డుకు కేజీ కందిపప్పును రూ.67కే అందిస్తూ వచ్చింది. కానీ జనవరిలో ఏమైందో జిల్లా కు కేవలం 60 శాతం కందిపప్పు మాత్రమే కేటాయిం చారు.అందులో జిల్లాలోని 5 ఎంఎల్ పాయి ంట్లకు సరుకు వచ్చిన తర్వాత నాణ్యత బాగా లేకపోవడంతో అనేక టన్నుల కంది పప్పును తిరిగి వెనక్కు పం పించేశారు. రాజమహేంద్రవరంలోని ఒక ఎంఎల్ పాయి ంట్ నుంచి 70 టన్నుల పప్పు తిరిగి పంపించాల్సి వచ్చింది.అన్నీ జిల్లా నుంచి ఇదే విధంగా పప్పు తిరిగి వెళ్లింది.జిల్లాకు 60 శాతం కేటాయించగా అందులో నాణ్యత లేని పప్పును తిరిగి పంపడం వల్ల జిల్లా లోని ప్రజలకు కేవలం 30 నుంచి 35 శాతం కార్డుదారులకు మాత్రమే పప్పు అందడం గమనార్హం.జిల్లాలోని 5 లక్షల 75 వేల మం ది రేషన్ కార్డు దారులకు ఒక్కో కార్డుకు ఒక కేజీ వంతున పంపిణీ చేయవలసి ఉం ది.కానీ కేవలం 30 నుంచి 35 శాతం మం దికే పప్పు అందడంతో అందరూ పండగరో జున అసంతృప్తితో ఉన్నారు.మొదట్లో రేషన్ అందిన వారికి పప్పు అందింది. చివరలో సరఫరా చేసిన వారికి పప్పు అందలేదు.
ఇంటింటికీ రేషన్‌తో ఇబ్బంది
గత వైసీపీ అమలు చేసిన ఇంటింటికీ రేషన్ విధానంతో ప్రతి నెల కొందరికి ఇబ్బం దులేర్పడుతున్నాయి. ఎండీయూ వాహనాలు తక్కువగా ఉండడంతో రెండు, మూడు గ్రా మాలకు ఒక వాహనం నడుపుతున్నారు. దీంతో ఎంఎల్ పాయింట్ల నుంచి కనీసం రెండు విడతలుగా సరుకు వస్తుంది.ప్రతి నెలా 20 నుంచి 25 వ తేదీ వరకూ ఒక విడతగా 25 నుంచి 30వ తేదీ లోపు రెండో విడతగా రేషన్‌ను డీలర్లకు, ఎండీయూ వా హనాలకు అందిస్తారు. వాటితో జనవరి 1 నుంచి 10వ తేదీలోపు కొంత మందికి జనవరి 15వతేదీ లోపు ఇస్తు న్నారు. ప్రతి నెలా ఎండీయూ వాహనాలు కొన్ని ప్రాం తాలకు చివరి రోజుల్లో వస్తాయి. ఏదైనా సరుకు కొరత వస్తే చివరి రోజుల్లో రేషన్ అందుకునే వారికే తక్కువ అవుతుంది. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా చాలా మందికి బియ్యం అందేవి కావు.కూటమి ప్రభుత్వంలో కూడా కందిపప్పుకు సమస్య వచ్చింది.
Updated Date - Jan 13 , 2025 | 12:59 AM