సెంట్రల్ జైలులో పరిచయం..ఇంటి తాళాలు బద్దలు కొట్టి దొంగతనం
ABN, Publish Date - Apr 05 , 2025 | 12:38 AM
అమలాపురం, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): సెంట్రల్ జైలులో ఉన్న సమయంలో ఏర్పడ్డ పరిచయంతో తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాలోని ఓ దొంగను పోలీసులు అరెస్టు చేసి అతడి నుంచి రూ.15.48 లక్షల విలువైన 19 రకాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ బీఆర్ అం బేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం విలేకర్ల సమావేశంలో జిల్లా ఎస్పీ

ఒకరి అరెస్టు.. మరొకరి కోసం గాలింపు
రూ.15.48 లక్షల విలువైన 19 రకాల బంగారు ఆభరణాలు స్వాధీనం
అమలాపురం, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): సెంట్రల్ జైలులో ఉన్న సమయంలో ఏర్పడ్డ పరిచయంతో తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాలోని ఓ దొంగను పోలీసులు అరెస్టు చేసి అతడి నుంచి రూ.15.48 లక్షల విలువైన 19 రకాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ బీఆర్ అం బేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం విలేకర్ల సమావేశంలో జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, అదనపు ఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్, కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్‌లు మాట్లాడారు. ఈ వివరాలను ఎస్పీ వెల్లడించారు. రావులపాలెం మండలం లక్ష్మీపోలవరం గ్రామంలో ఫిబ్రవరి 22వ తేదీన రాత్రి సమయంలో దొంగలు ఓ ఇంటి తాళాలు బద్దల కొట్టి బంగారు వస్తువులను భారీగా చోరీ చేశారు. వాటిని అమ్మే క్రమంలో పోలీసులకు పట్టుబడ్డారు. పి.గన్నవరం మండలం మానేపల్లి గ్రామానికి చెందిన ఉండి శివసుబ్రహ్మణ్యంతో పాటు సెంట్రల్ జైలులో పరిచమైన పందిరి వెంకటనారాయణ ఇద్దరూ కలిసి లక్ష్మీపోలవరంలోని ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. అయితే వాటిలో కొన్ని వస్తువులను అమ్మేందుకు ప్రయత్నిస్తున్న ఉండి శివసుబ్రహ్మణ్యంను రావులపాలెం జూనియర్ కళాశాల సమీపంలో గల సర్వీసు రోడ్డులోని ఖాళీ స్థలంలో ఉండగా పాత నేరస్తుడైన సుబ్రహ్మాణాన్ని అదుపులోకి తీసుకుని అరెస్టుచేశారు. అతడి నుంచి రూ.15.48లక్షలు విలువైన 172.661 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో మరో నిందితుడైన పందిరి వెంకటనారాయణ కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. ఈ కేసును చేధించడంలో కీలకంగా పనిచేసిన రావులపాలెం సీఐ ఎం.శేఖర్‌బాబు ఆధ్వర్యంలోని పోలీసు సిబ్బందికి రివార్డులు అందించారు. దర్యాప్తులో సహకరించిన హెచ్‌సీ ఎస్.సత్యనారాయణ, కానిస్టేబుల్ పి.త్రిమూర్తులు, సీహెచ్ శ్రీనుబాబు, జి.కృష్ణసాయి, సుంకర బైసన్‌జీవన్‌కు ప్రశంసాపత్రాలు అందించి అభినందించారు. రికవరీ చేసిన వస్తువులను డీఎస్పీ మురళీమోహన్ ప్రదర్శించారు.
Updated Date - Apr 05 , 2025 | 12:38 AM