బుద్ధావతారంలో వేంకటేశ్వరస్వామి
ABN, Publish Date - Jan 02 , 2025 | 01:20 AM
దశావతార ఉత్సవాలను పురస్కరించుకుని బుధవారం రాయవరం శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి బుద్ధ్దావతారంలో పూజలందుకున్నారు.
రాయవరం, జనవరి 1(ఆంధ్రజ్యోతి): దశావతార ఉత్సవాలను పురస్కరించుకుని బుధవారం రాయవరం శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి బుద్ధ్దావతారంలో పూజలందుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, తిరుప్పావై పారాయణం, తులసిదళ అర్చనలు, నీరాజన మంత్రపుష్పాలు, మహానివేదన జరిపి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని భక్తులు స్వామివార్ని దర్శించుకునేందుకు బారులుతీరారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు అంగర బాబు, పెద్దింటి కృష్ణమాచార్యులు, భక్తసంఘం సభ్యులు పాల్గొన్నారు.
Updated Date - Jan 02 , 2025 | 01:20 AM