లారీ నుంచి మంటలు

ABN, Publish Date - Feb 10 , 2025 | 12:34 AM

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గామన్‌బ్రిడ్జిపై వెళ్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. క్వార్ట్జ్‌ రాయిని తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడ నుంచి కాకినాడ పోర్టుకు రవాణాచేస్తున్న లారీ గామన్‌ బ్రిడ్జిపై కొవ్వూరు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తుండగా బ్రిడ్జి 108వ స్తంభం వద్ద అగ్ని ప్రమాదానికి గురైంది. లారీ బ్యాటరీ షార్ట్‌ సర్కూట్‌ కావడంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయని డ్రైవర్‌ లోండంగి శ్రీశైలం తెలిపారు.

లారీ నుంచి మంటలు
దగ్ధమవుతున్న లారీ
  • బ్యాటరీ షార్ట్‌సర్క్యూట్‌తో ప్రమాదం

  • రూ.10 లక్షలు ఆస్తి నష్టం

  • కొవ్వూరు గామన్‌ బ్రిడ్జిపై ఘటన

  • గంటకు పైగా నిలిచిపోయిన ట్రాఫిక్‌

కొవ్వూరు/రాజమహేంద్రవరం రూరల్‌, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గామన్‌బ్రిడ్జిపై వెళ్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. క్వార్ట్జ్‌ రాయిని తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడ నుంచి కాకినాడ పోర్టుకు రవాణాచేస్తున్న లారీ గామన్‌ బ్రిడ్జిపై కొవ్వూరు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తుండగా బ్రిడ్జి 108వ స్తంభం వద్ద అగ్ని ప్రమాదానికి గురైంది. లారీ బ్యాటరీ షార్ట్‌ సర్కూట్‌ కావడంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయని డ్రైవర్‌ లోండంగి శ్రీశైలం తెలిపారు. సమాచారం తెలుసుకున్న రాజమహేంద్రవరం, కొవ్వూరు అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. అప్పటికే లారీ కాలిపోవడంతో సుమారు రూ.10 లక్షలు ఆస్తి నష్టం సంభవించిందన్నారు. ఈ సంఘటనతో బ్రిడ్జిపై సుమారు గంటకు పైగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. పోలీసులు ట్రాఫిక్‌ క్రమబద్ధీకరించారు. కార్యక్రమంలో డీడీఆర్‌ఎఫ్‌ సీహెచ్‌. మార్టిన్‌ లూథర్‌కింగ్‌, రాజమహేంద్రవరం, కొవ్వూరు ఫైర్‌ అధికారులు పి.శ్రీనివాసరావు, ఏవీఎస్‌ఎన్‌ఎస్‌ వేణు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 10 , 2025 | 12:34 AM