ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘నన్నయ’ అభివృద్ధికి సహకరించాలి

ABN, Publish Date - Jan 02 , 2025 | 01:03 AM

దివాన్‌చెరువు, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): ప్రతీ ఒక్కరూ తమ పనిని త్రికరణశుద్దిగా నిర్వహిస్తూ విశ్వవిద్యాలయ అభివృద్ధికి సహకరించాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య వై.శ్రీనివాసరావు అన్నారు. విశ్వవిద్యాలయం 2025 క్యాలెండర్‌ను బుధవారం ఆయన ఆవిష్కరించా

నన్నయ విశ్వవిద్యాలయం క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న వీసీ శ్రీనివాసరావు

వీసీ శ్రీనివాసరావు

దివాన్‌చెరువు, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): ప్రతీ ఒక్కరూ తమ పనిని త్రికరణశుద్దిగా నిర్వహిస్తూ విశ్వవిద్యాలయ అభివృద్ధికి సహకరించాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య వై.శ్రీనివాసరావు అన్నారు. విశ్వవిద్యాలయం 2025 క్యాలెండర్‌ను బుధవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన సంవత్సరంలో నన్నయ విశ్వవిద్యాలయ ప్రాంగణాలు, అనుబంధ కళాశాలల సిబ్బంది, విద్యార్థులంతా నూతన లక్ష్యాలను ఎంచుకుని సాకారం చేసేందుకు కృషి చేయాలన్నారు. కొత్త సంవత్సరంలో విద్య, ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం విశ్వవిద్యాలయంలోని అన్ని విభాగాలను వీసీ సందర్శించి అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. రిజిస్ట్రార్‌ ఆచార్య జి.సుధాకర్‌, విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 02 , 2025 | 01:03 AM