పౌష్టికాహార పంపిణీలో నిర్లక్ష్యాన్ని సహించం
ABN, Publish Date - Mar 14 , 2025 | 12:47 AM
ప్రభుత్వం అందించే పౌష్ఠికాహార పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని రాష్ట్ర పుడ్ కమిషన్ సభ్యుడు జక్కంపూడి కిరణ్ హెచ్చరించారు. గురువారం మండలంలోని పలు అంగన్‌వాడీ కేంద్రాలను, రేషన్ షాపులను, ఉన్నత పాఠశాలను, ఏరియా ఆసుపత్రిని ఆయన తనిఖీ చేశా రు.

రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు కిరణ్
అనపర్తి మండలంలో పర్యటన
అనపర్తి, మార్చి 13(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అందించే పౌష్ఠికాహార పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని రాష్ట్ర పుడ్ కమిషన్ సభ్యుడు జక్కంపూడి కిరణ్ హెచ్చరించారు. గురువారం మండలంలోని పలు అంగన్‌వాడీ కేంద్రాలను, రేషన్ షాపులను, ఉన్నత పాఠశాలను, ఏరియా ఆసుపత్రిని ఆయన తనిఖీ చేశా రు. ముందుగా అనపర్తిలోని గాంధీనగర్, సునందపేట, ఇందిరానగర్, షారోన్‌పురం, టీటీడీ కళ్యాణ మండపం ఏరియాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్టాక్ రికార్డులు నిర్వహించకపోవడం, సెంటర్ నిర్వహణ సక్రమంగా లేకపోవడం గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీడీపీవో, సూపర్‌వైజర్లకు మెమో ఇవ్వా లని పీడీ కె.విజయకుమారిని ఆదేశించారు. అనంతరం గాంధీనగర్‌లోని రేషన్ షాపును తనిఖీ చేశారు. అలాగే బాలికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏరియా ఆసుపత్రిని పరిశీలించారు. రోగుల కోసం బయట నుంచి తీసుకువచ్చిన భోజనాన్ని రుచి చూసి భోజనం మెరుగు పర్చాల్సిన అవసరం ఉందని సూపరింటెండెంట్ డాక్టర్ తాడి రామగుర్రెడ్డిని సూచించారు. అనంతరం లక్ష్మీనరసాపురంలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌ను పరిశీలించి విద్యార్దులతో కలిసి భోజనం చేసి సంతృప్తి వ్యక్తంచేశారు. కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి విజయకుమారి, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ రాధిక, గిరిజన సంక్షేమ జిల్లా అఽధికారి కేఎన్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Mar 14 , 2025 | 12:47 AM