27న ఉపసర్పంచ్‌ల ఎన్నిక

ABN, Publish Date - Mar 24 , 2025 | 12:31 AM

మళ్లీ ఎన్నికల సందడి మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నిక జరిగి నాలుగేళ్లు పూర్తికావడం తో పలు చోట్ల అభ్యర్థుల మార్పులు అవిశ్వాస తీర్మానాలు ఆరంభంకానున్నాయి.

27న ఉపసర్పంచ్‌ల ఎన్నిక

ఉమ్మడి జిల్లాలో ఇదీ లెక్క

పల్లెల్లో ఎన్నికల సందడి

(రాజమహేంద్రవరం -ఆంధ్రజ్యోతి)

మళ్లీ ఎన్నికల సందడి మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నిక జరిగి నాలుగేళ్లు పూర్తికావడం తో పలు చోట్ల అభ్యర్థుల మార్పులు అవిశ్వాస తీర్మానాలు ఆరంభంకానున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు డివిజన్లలో మొ త్తం 35 పంచాయతీల్లో ఖాళీ అయిన ఉపసర్పంచ్‌ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆయా పంచాయతీల పరిధిలోని వార్డు సభ్యులకు నోటీసులు ఇచ్చారు. 27న ఈవోపీఆర్‌డీ ఎన్నికల అధికారిగా ఆయా పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తారు.కూటమి అధికారంలోకి ఉండడంతో ఉపసర్పంచ్‌ పదవులు కైవశంచేసుకోవాలనే వ్యూహంతో వ్యవహరిస్తోంది.

ఫ తూర్పుగోదావరి జిల్లాలో 12 ఉపసర్పంచ్‌ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి.గోకవ రం మండలం మల్లవరం, కొవ్వూరు మండలం పెనకనమెట్ట, రాజానగరం మండలం పాతతుంగపాడు, గోపాలపురం మండలం కొవ్వూరుపాడు,గోపాలపురం,వెంకటాయపాలెం, తాళ్ళపూడి మండలం తాడిపూడి, అనపర్తి మండలం లక్ష్మినరసాపురం,రంగంపేట మండలం మర్రిపూడి, కడియం మం డలం మురమండ,సీతానగరం మండలం మునికూడలి,ఉండ్రాజవరం గ్రామాల్లో ఉప సర్పంచ్‌ ఎన్నికలు జరుగనున్నాయి.

ఫడాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఆత్రేయపురం మండలం పులిదిండి, రాయ వరం మండలం వెదురుపాక, రాయవరం, ఐ.పోలవరం మండలంలో జి.మూలపొ లం,ముమ్మిడివరం మండలం సిహెచ్‌.గున్నేపల్లి, రాజోలు మండలం సోంపల్లి, శివకోటి, ఆలమూరు మండలం మొదుకూరు, కొత్త పేట మండలం కొత్తపేట, పలివెల, మలికిపురం మండలం లక్కవరం,చింతలమోరి, సఖినేటిపల్లి మండలంలో మోరిపాడు, అం తర్వేదిపాలెం, అంబాజీపేట మండలంలో మాచవరం, అల్లవరం మండలంలో ఎంట్రి కోన, అయినవిల్లి మండలంలో బోతుకుర్రు, రామచంద్రపురం మండలం నెలపర్తిపాడు పంచాయతీల్లో ఉపసర్పంచ్‌ పదవులకు ఎన్నికలు జరుగనున్నాయి.

ఫ కాకినాడ జిల్లాలో పెదపాడు మండలం రామేశ్వరం,తుని పరిధిలో దొండవాక,సామర్లకోట మండలం బి.వేమవరం, తొండంగి మండలం పైడికొండ,ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడి పంచాయతీల పరిధిలో ఉపసర్పంచ్‌ ఎన్నికలు జరుగనున్నాయి.

Updated Date - Mar 24 , 2025 | 12:31 AM