పండగ బాదుడే!
ABN, Publish Date - Jan 10 , 2025 | 01:02 AM
సంక్రాంతి సమీపించడంతో టిక్కెట్ ధరలు షాక్ కొడుతున్నాయి. సామాన్యుడికి అందకుం డా ఆకాశాన్నంటుతున్నాయి. పండగకు ఇంటికి రావాలనుకునేవారి జేబులకు చిల్లులు పడుతు న్నాయి. సంక్రాంతి పండగ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు అధికంగా హైదరాబాద్ నుంచి వస్తారు. ప్రైవేటు ట్రావెల్స్ రెట్టింపు ధరలు పిండేస్తుం డగా రైళ్లలో ఒక్క సీటు లేని పరిస్థితి.
పెద్ద పండుగకు వద్దామంటే.. ప్రైవేటు దోపిడీ
పండుగంతా ప్రైవేట్ స్పెషల్‌దే
బస్సు టిక్కెట్ల ధరకు రెక్కలు
రెట్టింపు ధరల వసూళ్లు
సీటు అయితే రూ.2 వేలు
బెర్త్ రూ.3 వేలు
రద్దీ పేరిట భారీ వసూళ్లు
ఆకాశంలో విమాన చార్జీలు
మూడు రెట్లు పెరిగిన వైనం
ఆర్టీసీ బస్సులకు భారీ డిమాండ్
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
సంక్రాంతి సమీపించడంతో టిక్కెట్ ధరలు షాక్ కొడుతున్నాయి. సామాన్యుడికి అందకుం డా ఆకాశాన్నంటుతున్నాయి. పండగకు ఇంటికి రావాలనుకునేవారి జేబులకు చిల్లులు పడుతు న్నాయి. సంక్రాంతి పండగ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు అధికంగా హైదరాబాద్ నుంచి వస్తారు. ప్రైవేటు ట్రావెల్స్ రెట్టింపు ధరలు పిండేస్తుం డగా రైళ్లలో ఒక్క సీటు లేని పరిస్థితి. పోనీ విమానంలో వద్దామనుకుంటే అవి కూడా ఫుల్ అయిపోయాయి. డిమాండ్ పెరగడంతో ఇండిగో కంపెనీ చార్జీలను భారీగా పెంచేసింది. పండగ రద్దీ పేరుతో సాధారణ రోజుల్లో ఉండే విమాన చార్జీ ధర రూ.3,299 కాస్తా ఇప్పుడు ఏకంగా రూ.15,850కి పెరిగిపోయింది.ప్రధానంగా హైద రాబాద్ నుంచి రాజమహేంద్రవరం విమానా శ్రయానికి ఇండిగో రోజుకు ఆరు సర్వీసులు నడుపుతోంది. శుక్రవారం నాటికి ఐదు విమా నాల్లో సీట్లన్నీ నిండిపోగా, ఒకే ఒక విమానంలో అరకొరగా సీట్లున్నాయి. అయితే వీటి చార్జీ ధర ఏకంగా రూ.15,086గా ఉంది. ఒకరకంగా ఐదు రేట్లు పెరిగిపోయి చార్జీలు షాక్ కొడుతున్నాయి. శనివారం అయితే నాలుగు విమానాల్లో సీట్లన్నీ నిండిపోగా రెండింటిలో మాత్రమే కొద్దిగా సీట్లు న్నాయి. అయితే చార్జీలు రూ.14,486 చొప్పున కంపెనీ వసూలు చేస్తోంది. ఈనెల 12న అయి తే టికెట్ ధరలు రూ.15,850 చొప్పున ఇండిగో వసూలు చేస్తోంది. 13న అంటే భోగి రోజున కాస్త డిమాండ్ తక్కువగా ఉండడంతో రూ. 11,650 వరకు చార్జీలు ఉన్నాయి. సంక్రాంతి రద్దీ నేపథ్యంలో రైల్వేశాఖ హైదరాబాద్ నుంచి కాకినాడకు రోజుకు మూడు ప్రత్యేక రైళ్లను అదనంగా నడుపుతోంది. వీటిలోనూ సీట్లన్నీ నిండిపోయి వెయిటింగ్ లిస్ట్ 290 వరకు ఉంది. మరికొన్నింటిలో ఏకంగా రిగ్రేట్ చూపుతోంది. వీటిలో సీట్ల లభ్యత ఈనెల 14 నుంచి మాత్ర మే ఉన్నాయి. పండగ తర్వాత తిరిగి హైదరా బాద్ ప్రయాణం అయ్యేవారికి ఇప్పటినుంచే విమాన చార్జీలు షాక్ కొడుతున్నాయి. ఈనెల 15న రాజమహేంద్రవరం నుంచి హైదరాబా ద్‌కు ఇండిగో విమాన చార్జీ సమయం బట్టి రూ.10,384 నుంచి రూ.14,887 వరకు ఎగబా కాయి. 16న ఏకంగా రూ.16,394 వరకు చార్జీలు పెరిగాయి. ఒకరకంగా చెప్పాలంటే ఈనెల 19 వరకు తిరుగు ప్రయాణానికి సంబంధించి బాదుడే బాదుడు అన్నట్టు కొనసాగుతోంది.
ఆర్టీసీ ఏం చేస్తుందో..
రాజమహేంద్రవరం అర్బన్, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ సంక్రాంతి బస్సు సర్వీసులకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. ప్రధానంగా హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి జిల్లాకు వచ్చే ప్రజల నుంచి ఈ డిమాండ్ ఎక్కువగా వినబడుతోంది. ఇప్పటికే జిల్లా ఆర్టీసీ ప్రీ-సంక్రాంతి ఆపరేషన్‌లో భాగంగా రాజమహేంద్రవరం, కొవ్వూరు, నిడదవోలు, గోకవరం డిపోల నుంచి 88 స్పెషల్ సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే ఈ స్పెషల్ సర్వీసుల్లో టిక్కెట్లన్నీ గతంలోనే హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. వీటితోపాటు షెడ్యూల్ సర్వీసుల్లో నూ టిక్కెట్లు లేవు. దీంతో హైదరాబాద్ నుంచి మరిన్ని బస్సులు నడపాలనే డిమాండ్ వస్తున్నట్టు ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్, చుట్టుపక్కల స్థిరపడిన వారు పెద్ద పండక్కి సొంతూర్లకు తరలివస్తారు. ఆర్టీసీ సర్వీసుల్లో సాధారణ బస్సు చార్జీలను మాత్రమే వసూలు చేస్తుండడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. జిల్లా ఆర్టీసీ మాత్రం హైదరాబాద్ నుం చి జిల్లాకు మరిన్ని స్పెషల్ సర్వీసులు నడిపేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నట్టు కనబడుతోంది. డిమాండ్‌కు అనుగుణంగా మరిన్ని స్పెషల్ సర్వీసులు నడపడం ద్వారా భారీగా ఆదాయం పొందే అవకాశం ఉన్నా ఆర్టీసీ తూర్పుగోదావరి జిల్లా అధికారులు ఇప్పటివరకూ అదనపు స్పెషల్స్‌పై ఎలాంటి ప్రకటనా చేయలేదు.
పండుగ పూట.. ప్రైవేట!
సామర్లకోట, జనవరి 9(ఆంధ్రజ్యోతి): మరో మూడు రోజుల్లో సంక్రాంతి. రైళ్లన్నీ ఫుల్ కావ డంతో హైదరాబాద్, బెంగళూరు, మైసూర్, చెన్నై ప్రాంతాల నుంచి ఉమ్మడి తూర్పుగోదా వరి జిల్లాలోని సామర్లకోట, కాకినాడ, రంగం పేట, రాజమహేంద్రవరం, ద్వారపూడి, అనప ర్తి, అటు కోనసీమ ప్రాంతాలకు వచ్చేందుకు ప్రైవేట్ ఏజన్సీల వద్దకు జనం పరుగులు తీస్తున్నారు. దీంతో ప్రైవేట్ ఆపరేటర్లు టిక్కెట్ల ధరలను అమాంతం పెంచేశారు. ఆన్‌లైన్‌లో భారీ ధరలకు టిక్కెట్ల విక్రయాలకు పోటీప డుతున్నారు. సంక్రాంతి పండుగను సొంతూళ్లో జరుపుకోవడం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసుల కల. దీనిని ప్రైవేట్ బస్సుల నిర్వాహ కులు సొమ్ము చేసుకుంటున్నారు. రైళ్లు ఫుల్ కావడంతో ప్రయాణికులకు ఏకైక ప్రత్యా మ్నాయ మార్గంగా ఉన్న ప్రైవేట్ బస్సుల టిక్కెట్ల ధరలను పెంచేశారు. సాధారణ రోజు ల్లో హైదరాబాద్ నుంచి సామర్లకోట మీదుగా కాకినాడకు రూ.890-900 మధ్య టిక్కెట్ ధర లను వసూలు చేస్తారు. బెంగుళూరు నుంచి రూ.1,500 నుంచి రూ.1,800 మధ్య వసూలు చేస్తారు. ప్రస్తుత ధరలు చూస్తే కళ్లు బైర్లు కమ్మేలా ఉన్నాయి. ఆన్‌లైన్‌లో హైదరాబాద్ నుంచి సామర్లకోటకు సీటు ఒక్కింటికి రూ. 1,880 వసూలు చేస్తున్నారు. ఇదే బెర్తులైతే రూ.2300-2600 చొప్పున వసూలు చేస్తున్నారు. చెన్నై, ముంబై వంటి ప్రాంతాల నుంచి టిక్కెట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అప్పర్, లోయ ర్ బెర్త్ అంటూ వేరు చేసి డిమాండ్‌ను బట్టి రూ.1,880 నుంచి రూ.3 వేల వరకూ ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు పిండేస్తున్నారు.
రోజుకు రూ.1.65 కోట్ల దోపిడీ
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో కాకినాడ నుంచి 40 ప్రైవేట్ బస్సులు, అమ లాపురం రాజోలు నుంచి 50 ప్రైవేట్ బస్సు లు, రాజమహేంద్రవరం నుంచి 60 ప్రైవేట్ బస్సులు వెరసి 150 ప్రైవేట్ బస్సులు హైద రాబాద్, బెంగుళూరు పట్టణాలకు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. ఒక్కొక్క బస్సు లోనూ సుమారు 50 నుంచి 55 మంది 8,250 మంది చొప్పున ప్రయాణిస్తుంటారు. పండుగ పేరిట స్పెషల్ ధరలతో ప్రయాణి కుల నుంచి ప్రైవేట్ బస్సుల ఆపరేటర్లు సుమారు రూ. 1.65 కోట్ల మేర ప్రతి రోజూ అదనపు వసూళ్లు చేస్తూ దారుణ దోపిడీకి గురిచేస్తున్నారు. అయినా ప్రభుత్వం కళ్లు తెరవకపోవడం గమనార్హం.
నేటి నుంచి ప్రైవేటు బస్సుల తనిఖీలు : డీటీవో
రాజమహేంద్రవరం అర్బన్, జనవరి9 (ఆంధ్రజ్యోతి) : సంక్రాంతి పండుగకు స్వస్థలాలకు వచ్చే ప్రయాణికుల నుంచి అధిక చార్జీలను వసూలు చేసినా, ప్రయాణ సమయంలో ప్రయాణికులకు అసౌకర్యం కలిగించినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తూర్పుగోదా వరి జిల్లా రవాణా అధికారి ఆర్.సురేష్ హెచ్చరించారు. వాహనాలకు సరైన రికార్డులు లేకపోయినా, నిబంధనలకు విరుద్ధంగా బస్సులు తిరుగుతున్నా జప్తు చేస్తామని స్పష్టంచేశారు.రాజమహేంద్రవరం డీటీవో కార్యాలయంలో గురువారం జిల్లాలోని ప్రైవేట్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యజమానులు, ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెంట్ల యజమానులతో సమావేశం నిర్వ హించారు. పండుగ సందర్భంగా తనిఖీలకు రవాణా అధికారులతో కూడిన స్పెషల్ టీంలను ఏర్పాటుచేశామన్నారు. ఈనెల 10వ తేదీ నుం చి 20వ తేదీ వరకూ తనిఖీలు నిర్వహిస్తామన్నారు. బస్సుల్లో ప్రయాణికుల లగేజీ బ్యాగు లు మాత్రమే ఉండాలని, వాణిజ్యపరమైన వస్తువులను తరలించకూడదన్నారు. ప్రయాణికులు సురక్షితంగా తీసుకురావాలని కోరారు.
Updated Date - Jan 10 , 2025 | 01:02 AM