డిప్యూటీ సీఎం ఆదేశాలతో నాలుగు దశాబ్దాల సమస్యకు పరిష్కారం

ABN, Publish Date - Apr 05 , 2025 | 12:37 AM

పిఠాపురం, ఏప్రిల్‌ 4(ఆం ధ్రజ్యోతి): నాలుగు దశాబ్దాలుగా పిఠాపురంలోని రథాలపేటలో ఉంటున్న తమకు ఇళ్ల పట్టాలులేవని అక్కడ ప్రజలు ఆ ప్రాంతంలో పర్యటించిన డిప్యూ టీ సీఎం పవన్‌కల్యాణ్‌ దృష్టికి తీసుకురావడంతో సమస్యకు పరిష్కారం లభించింది. పవన్‌కల్యాణ్‌ ఆదేశాలతో ఆ ప్రాంతంలో ని వాసం

డిప్యూటీ సీఎం ఆదేశాలతో నాలుగు దశాబ్దాల సమస్యకు పరిష్కారం
పిఠాపురంలో ఎల్‌పీసీలు అందజేస్తున్న ఎమ్మెల్సీ నాగబాబు

పిఠాపురం, ఏప్రిల్‌ 4(ఆం ధ్రజ్యోతి): నాలుగు దశాబ్దాలుగా పిఠాపురంలోని రథాలపేటలో ఉంటున్న తమకు ఇళ్ల పట్టాలులేవని అక్కడ ప్రజలు ఆ ప్రాంతంలో పర్యటించిన డిప్యూ టీ సీఎం పవన్‌కల్యాణ్‌ దృష్టికి తీసుకురావడంతో సమస్యకు పరిష్కారం లభించింది. పవన్‌కల్యాణ్‌ ఆదేశాలతో ఆ ప్రాంతంలో ని వాసం ఉం టున్న 15మందిని గురిం్తచి వారికి రెవెన్యూ అధికారులు ఎల్‌పీసీలు జారీ చేశా రు. శుక్రవారం కాకినాడ జిల్లా పిఠాపురంలో లబ్ధిదారులకు ఎమ్మెల్సీ నాగబాబు ఎల్‌పీసీ లు అందజేశారు. దీంతో లబ్ధిదారులు ఆనం దం వ్యక్తం చేస్తూ పవన్‌ రథాలపేటలో ప ర్యటించినప్పుడు సమస్యలు తెలియజేయగానే కుళాయి వేయించి తాగునీటి సమస్య పరిష్కరించారని, ఇప్పుడు పట్టాలు అందజేశారని తెలిపారు. అంతకుముందుకు సాం ఘిక సంక్షేమశాఖ బాలికల సమీకృత వసతిగృహంలో రూ.36.5లక్షలతో నిర్మించిన ఆధు నీకరణ పనులను, పాదగయ ఎదురుగా జేజీఆర్‌ గ్రూపు నిర్మించిన బస్‌షెల్టర్‌ను నాగబాబు ప్రారంభించారు. వసతిగృహంలో బాలికలతో ముచ్చటించారు. వసతులు, ఇం కా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు. కార్యక్రమంలో శాసనమండలి ప్రభుత్వ విప్‌ పిడుగు హరిప్రసాద్‌, ఏపీ టిడ్కో చైర్మన్‌ వేములపాటి అజయకుమార్‌, కౌడా చైర్మన్‌ తుమ్మల బాబు, జిల్లా కలెక్టర్‌ సగిలి షాన్‌హన్‌, ఎస్పీ బిందుమాధవ్‌, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు, బీమిలి జనసేన ఇన్‌చార్జి పంచకర్ల సందీప్‌, గోదావరి డెల్టా ప్రాజెక్టు కమిటీ చై ర్మన్‌ మురాలశెట్టి సునీల్‌కుమార్‌ ఉన్నారు.

Updated Date - Apr 05 , 2025 | 12:37 AM