ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కలెక్టరేట్‌లో సంక్రాంతి సంబరాలు

ABN, Publish Date - Jan 11 , 2025 | 01:54 AM

సనాతన సంస్కృతి సంప్రదాయాల కలయికే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి అని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ పేర్కొన్నారు. సంక్రాంతి పండుగలో ఎంతో వైజ్ఞానికత ముడిపడి ఉందని వివరించారు

అమలాపురం టౌన్‌, జనవరి 10(ఆంధ్రజ్యోతి): సనాతన సంస్కృతి సంప్రదాయాల కలయికే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి అని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ పేర్కొన్నారు. సంక్రాంతి పండుగలో ఎంతో వైజ్ఞానికత ముడిపడి ఉందని వివరించారు. కలెక్టరేట్‌ ప్రాంగణంలో శుక్రవారం ముందస్తు సంకాంత్రి సంబరాలను ఉద్యోగులతో వైభవంగా నిర్వహించారు. భోగిమంటలు వేసి రంగవల్లుల, థగ్‌ ఆఫ్‌ వార్‌ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కోనసీమ జిల్లా ప్రజలందరికీ తొలుత సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు సంస్కృతి సంప్రదాయాలను గౌరవించాలన్నారు. కలెక్టరేట్‌లో సంక్రాంతి శోభను తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేసిన పరిపాలనాధికారి కడలి కాశీవిశ్వేశ్వరరావును జేసీ అభినందించారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు కలెక్టర్‌ బహుమతులు అందజేశారు.

Updated Date - Jan 11 , 2025 | 01:54 AM