ప్రభల తీర్థాలలో అల్లర్లకు పాల్పడితే కఠినచర్యలు
ABN, Publish Date - Jan 12 , 2025 | 01:10 AM
సంక్రాంతి సందర్భంగా కనుమ రోజు నిర్వహించే ప్రభల తీర్థాలలో అల్లర్లకు పాల్పడితే కఠినమైన సెక్షన్లతో కేసులు నమోదు చేస్తామని కొత్తపేట డీఎస్పీ వై.గోవిందరావు హెచ్చ రించారు. ప్రభల తీర్థం సందర్భంగా స్థానిక పెద్దవీధి లోని కోప్పా మర్చంట్స్ భవనంలో ఉత్సవ కమిటీ నిర్వాహకులతో సీఐ రుద్రరాజు భీమరాజు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
అంబాజీపేట, జనవరి11 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి సందర్భంగా కనుమ రోజు నిర్వహించే ప్రభల తీర్థాలలో అల్లర్లకు పాల్పడితే కఠినమైన సెక్షన్లతో కేసులు నమోదు చేస్తామని కొత్తపేట డీఎస్పీ వై.గోవిందరావు హెచ్చ రించారు. ప్రభల తీర్థం సందర్భంగా స్థానిక పెద్దవీధి లోని కోప్పా మర్చంట్స్ భవనంలో ఉత్సవ కమిటీ నిర్వాహకులతో సీఐ రుద్రరాజు భీమరాజు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రభల తీర్థం జరిగే జగ్గన్నతోటలో ఏకాదశ రుద్రుల ప్రభల ఉత్సవానికి భారీ బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఉత్సవ కమిటీ సభ్యులు తీర్థం ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలన్నారు. తీర్థం జరిగే ప్రాంతాలలో బెల్ట్ షాపులను ఏర్పాటు చేస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకొంటామన్నారు. జగ్గన్నతోటలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపడు తున్నామని చెప్పారు. ప్రభల తీర్థానికి సంబంధించి వీడియో చిత్రీకరణ చేయించాలని ఆయా ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు. తహశీల్దారు జె.వెంకటేశ్వరి, ఎస్‌ఐ కె.చిరంజీవి, సర్పంచ్ దొంగ నాగేశ్వరరావు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Updated Date - Jan 12 , 2025 | 01:10 AM