ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భూసేకరణ పూర్తయిన ప్రాంతాల్లో రైల్వే లైన్‌ నిర్మాణ పనులు ప్రారంభించాలి : జిల్లా కలెక్టర్‌

ABN, Publish Date - Jan 11 , 2025 | 01:52 AM

కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్‌లో భాగంగా భూ సేకరణ పూర్తి అయిన ప్రాంతాల్లో రైల్వేలైన్‌ నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ రైల్వేశాఖ అధికారులను ఆదేశించారు.

భూసేకరణ పూర్తయిన ప్రాంతాల్లో రైల్వే లైన్‌ నిర్మాణ పనులు ప్రారంభించాలి : జిల్లా కలెక్టర్‌

అమలాపురం, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్‌లో భాగంగా భూ సేకరణ పూర్తి అయిన ప్రాంతాల్లో రైల్వేలైన్‌ నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ రైల్వేశాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం కోనసీమ రైల్వేలైన్‌కు సంబంధించి రైల్వేలైన్‌ నిర్మాణ పనుల పురోగతిపై రెవెన్యూ, రైల్వేశాఖ అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వేలైన్‌లో భాగంగా భూసేకరణ పూర్తి అయిన ప్రాంతాల్లోని భూమిని రైల్వే అధికారులు స్వాధీనం చేసుకుని నిర్మాణ పనులను ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. అయినవిల్లి మండలంలోని శానపల్లిలంక, సిరిపల్లి, మాగాం, అమలాపురం రూరల్‌ మండలంలోని ఎ.వేమవరం, భట్నవిల్లి గ్రామాల్లో రైల్వేలైన్‌కు సంబంధించిన భూసేకరణ పూర్తయిందన్నా రు. రైల్వే అధికారులు గ్రామానికి ఒక ప్రత్యేక బృందం చొప్పున పంపించి నిర్మాణ పనులను ప్రారంభించాలని సూచించారు. సంబంధిత రెవెన్యూ అధికారులు ఆయా గ్రామాల్లో గతం లో భూ సేకరణ పూర్తి అయిన భూములను సర్వేచేసి హద్దులను గుర్తించి రైల్వే అధికారులకు తక్షణం అప్పగించాలన్నారు. సంబంధిత ప్రాంతాల్లోని రైతులు తదుపరి పంట వేసేలోపు రైల్వే అధికారులు భూసేకరణ పూర్తి అయిన భూములను తమ అధీనంలోకి తీసుకుని నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు. రైల్వేలైన్‌ నిర్మాణంలో భాగంగా భూసేకరణ విషయంలో కోర్టు పరిధిలో ఉన్న అంశాలను త్వరితగతిన పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. రైల్వేలైన్‌ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో జేసీ టి.నిషాంతి, దక్షిణ మధ్యరైల్వే ఉప ముఖ్య ఇంజనీర్‌ ఎ.బద్దియ్య, కొత్తపేట, అమలాపురం, ఆర్డీవోలు పి.శ్రీకర్‌, కె.మాధవి, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఈ సీహెచ్‌ఎన్వీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2025 | 01:52 AM