Share News

'రాజానగరం'కు మరో రెండు పీహెచ్‌సీలు

ABN , Publish Date - Apr 16 , 2025 | 01:12 AM

రాజానగరం నియోజకవర్గంలో మరో రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌ సీ)లు మంజూరయ్యాయి. ఇందుకు సంబం ధించిన వివరాలను ఎమ్మెల్యే బత్తుల బలరా మకృష్ణ మంగళవారం వెల్లడించారు.

'రాజానగరం'కు మరో రెండు పీహెచ్‌సీలు
ఆరోగ్యశాఖ మంత్రికి సత్యకుమార్‌ యాదవ్‌కు నివేదికలు అందజేస్తున్న ఎమ్మెల్యే బత్తుల(ఫైల్‌)

  • త్వరలో గాదరాడలో ఒకటి, శ్రీకృష్ణపట్నంలో మరొకటి ఏర్పాటు

  • ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ

రాజానగరం/కోరుకొండ, ఏప్రిల్‌ 15 (ఆంధ్ర జ్యోతి): రాజానగరం నియోజకవర్గంలో మరో రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌ సీ)లు మంజూరయ్యాయి. ఇందుకు సంబం ధించిన వివరాలను ఎమ్మెల్యే బత్తుల బలరా మకృష్ణ మంగళవారం వెల్లడించారు. నియో జకవర్గ పరిధిలో జనాభాను దృష్టిలో ఉంచు కుని గతంలో ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్‌ యాదవ్‌ను కలిసి విజ్ఞప్తిచేసిన నేప థ్యంలో కొత్తగా రెండు పీహెచ్‌సీలు ఏర్పాటు కు అనుమతిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్త ర్వులు వెలువడినట్టు చెప్పారు. ప్రస్తుతం నియోజకవర్గంలో రాజానగరం, పాలచర్ల, కోరుకొండ, కోటికేశవరం, దోస కాయలపల్లి, సీతానగరం, బొబ్బిల్లంకలో పీహెచ్‌సీలున్నాయి. ప్రస్తుతం ఉన్న జనాభా దృష్ట్యా కొత్తగా మం జూరు చేయాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యా ణ్‌లకు విన్నవించామన్నారు. దీంతో కోరుకొండ మండలం గాదరాడ, రాజా నగరం మండలం శ్రీకృష్ణపట్నం గ్రామాల్లో పీహెచ్‌సీలను నిర్మించేందుకు ప్రభుత్వం నుం చి ఉత్తర్వులు వెలువడ్డాయని, ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని డీఎంఅండ్‌హెచ్‌వో డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఆదేశించగా, సదరు నివేదికలను ప్రభుత్వానికి పంపినట్టు ఎమ్మెల్యే బత్తుల పేర్కొన్నారు. త్వరలోనే పీహెచ్‌సీల ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టనున్నారు.

Updated Date - Apr 16 , 2025 | 01:12 AM