రహదారుల పటిష్టతకు ప్రభుత్వం చర్యలు
ABN, Publish Date - Apr 04 , 2025 | 01:03 AM
నియో జకవర్గంలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఎమ్మెల్యే బత్తుల బలరా మకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం తన కార్యాలయంలో ఆర్‌అండ్‌బీ అధికారులతో ఎమ్మెల్యే సమీక్షించారు. నియోజకవర్గంలో మిగి లున్న ప్యాచ్ వర్క్ పనులను త్వరగా పూర్తి చే యాలని ఆదేశించారు.

ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్ అధికారులతో సమీక్షలో ఎమ్మెల్యే బత్తుల
రాజానగరం, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): నియో జకవర్గంలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఎమ్మెల్యే బత్తుల బలరా మకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం తన కార్యాలయంలో ఆర్‌అండ్‌బీ అధికారులతో ఎమ్మెల్యే సమీక్షించారు. నియోజకవర్గంలో మిగి లున్న ప్యాచ్ వర్క్ పనులను త్వరగా పూర్తి చే యాలని ఆదేశించారు. సీతానగరం క్రీడా వికాస కేంద్రం పనులు తక్షణమే పూర్తి చేసి క్రీడాకారు లకు అందుబాటులోకి తీసుకురా వాలన్నారు. రఘుదేవపురం-మల్లంపూడి రోడ్డు పనులు ఈ నెల 15నుంచి ప్రారంభించాలని ఎమ్మెల్యే సం బంధిత శాఖాధికారులను ఆదేశించారు. నియో జకవర్గంలో 326 కిలో మీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రహదారులున్నా యని, వీటిలో ఎండీఆర్ కింద 30 రోడ్లు, స్టేట్ హైవేస్ కింద ఆరు రోడ్లు ఉన్నాయని, ఈ రోడ్ల అన్నింటి పటి ష్టతకు ప్రభుత్వం చర్యలు చేప డుతోందన్నారు. అలాగే సీతానగరం రోడ్డు సత్వరమే ప్రారం భించాలని, రాపాక రోడ్డు మెట్ట గంగాలమ్మ ఆలయం వరకు పూర్తిగా ఛిద్రమైందని, మరమ్మతు పనులు చేప ట్టాలన్నారు. కోటికేశవ రం-నాగంపల్లి మూడు కిలోమీటర్లు మేర రోడ్డుకు నిధులు మంజూర య్యాయని వెంటనే పనులు ప్రారంభించాల న్నారు. రాజానగరం-గాదరాడ రోడ్డు పది కిలో మీటర్లు, నాగంపల్లి-చిన కొండేపూడి రోడ్డు నిర్మా ణ పనులు పూర్తి చేయాలన్నారు. అలాగే రాజా నగరం-పెడపర్తి రోడ్డు, నామవరం-యర్రంపా లెం, కొండగుంటూరు-సంపత్‌నగరం రోడ్డు పను లు వెంటనే ప్రారంభించాలన్నారు. శ్రీకృష్ణప ట్నం-కానవరం, రాధేయపాలెం రోడ్డు త్వరగా అభివృద్ధి చేయాలన్నారు. నరేంద్ర పురం-కొత్త వెలుగుబంద, చక్రద్వారబంధం రోడ్డు మేర ప్యాచ్ వర్క్ పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఎమ్మెల్యే బత్తుల ఆదేశించారు.
కాలువల్లో పూడికతీత చేపట్టాలి
నియోజకవర్గంలో వివిధ సాగునీటి పథకా లు, ప్రాజెక్టుల కింద ఓఅండ్‌ఎం పనులు చేప ట్టడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎమ్మె ల్యే బత్తుల బలరామకృష్ణ ఇరిగేషన్ అధికా రులను ఆదేశించారు. ఎత్తపోతల పథకాలు, ప్ర ధాన, పిల్ల కాలువల్లో పూడికతీత పనులు, జం గిల్ క్లియరెన్స్ పనులు వెంటనే చేపట్టాలన్నారు. దీనిలో భాగంగా చాగల్నాడు ఎత్తిపోతల పథ కం, తొర్రిగడ్డ, పాతవెంకటనగరం, కొత్త వెంకట నగరం, పుష్కర పథకాల కోసం సిద్ధం చేసిన ప్రతిపాదనలను అధికారులు ఎమ్మెల్యేకు నివేదిం చారు. ఆయా సమీక్షా సమావేశాల్లో అర్‌అండ్‌బి, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Apr 04 , 2025 | 01:03 AM