ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏపీఎస్‌ఆర్టీసీ సంక్రాంతి స్పెషల్స్‌

ABN, Publish Date - Jan 09 , 2025 | 12:43 AM

సంక్రాంతి వస్తుందంటే హైదరాబాద్‌ నుంచి కోనసీమకు వచ్చే ప్రయాణికుల కోసం ఆర్టీసీ సర్వీసులతో పాటు ప్రైవేటు ట్రావెల్స్‌ పోటీపడి మరీ బస్సులను ఏర్పాటు చేస్తాయి. ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీతో పాటు మన ప్రైవేటు ట్రావెల్‌ బస్సుల టిక్కెట్‌ ధరలను ఆన్‌లైన్‌లో చూసి ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు.

అమలాపురం రూరల్‌, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి వస్తుందంటే హైదరాబాద్‌ నుంచి కోనసీమకు వచ్చే ప్రయాణికుల కోసం ఆర్టీసీ సర్వీసులతో పాటు ప్రైవేటు ట్రావెల్స్‌ పోటీపడి మరీ బస్సులను ఏర్పాటు చేస్తాయి. ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీతో పాటు మన ప్రైవేటు ట్రావెల్‌ బస్సుల టిక్కెట్‌ ధరలను ఆన్‌లైన్‌లో చూసి ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నా పట్టించుకునేవారే లేరు. తెలంగాణా ఆర్టీసీ సైతం టిక్కెట్‌ ధరలను రెట్టింపు చేసింది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో కొనసాగుతున్న ధరలను పోల్చి చూసుకుంటే తెలంగాణ ఆర్టీసీ బస్సు టిక్కెట్‌ ధర హైదరాబాద్‌ నుంచి అమలాపురానికి రూ.1800 ఉంది. ఇక మన ప్రాంత ప్రైవేటు ట్రావెల్‌ బస్సులు అయితే రూ.1599 నుంచి రూ.2500 వరకు దోచేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏపీఎస్‌ఆర్టీసీ సంస్థ ప్రయాణికులకు సంక్రాంతి కానుక ప్రకటించింది. సాధారణ రోజుల్లో వసూలు చేసే టిక్కెట్‌ ధరలనే వసూలు చేస్తామని ప్రకటించింది. సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని ఈ నెల 9 నుంచి ప్రత్యేక బస్సు సదుపాయాలు కల్పించడంతో పాటు ఆన్‌లైన్‌లో టిక్కెట్ల రిజర్వేషన్లు అందుబాటులో ఉంచారు.

సంక్రాంతికి 217 ప్రత్యేక బస్సు సర్వీసులు

చల్లా సత్యనారాయణమూర్తి,

అమలాపురం ఆర్టీసీ డిపో మేనేజర్‌

సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని అమలాపురం ఆర్టీసీ బస్సు డిపో నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేశాం. ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు హైదరాబాద్‌ నుంచి అమలాపురం వైపు వచ్చే ప్రయాణికుల కోసం మొత్తంగా 97 సర్వీసులు ఏర్పాటు చేశాం. సాధారణ రోజుల్లో హైదరాబాద్‌కు 12 బస్సు సర్వీసులు నడుపుతున్నాం. వీటిలో 6 శంషాబాద్‌ విమానాశ్రయానికి, 6 బీహెచ్‌ఈఎల్‌, ఇతర ప్రాంతాలకు నడుపుతాం. సంక్రాంతిని పురస్కరించుకుని వీటికి అదనంగా 85 సర్వీసులను నాలుగు రోజుల పాటు నడిపే విధంగా ప్రణాళికలు రూపొందించాం. ఇప్పటికే చాలా వరకు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్‌ అయ్యాయి. అమలాపురం నుంచి తిరుగు ప్రయాణం కోసం ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు 12 రెగ్యులర్‌ సర్వీసులతో పాటు రోజుకు 22 సర్వీసులు చొప్పున మొత్తంగా డిమాండ్‌ను బట్టి 120 బస్సు సర్వీసులు 6 రోజుల పాటు నడుపుతామన్నారు. ప్రయాణికులపై ఎటువంటి అదనపు భారం మోపడం లేదు. సాధారణ రోజుల్లో వసూలు చేసే టిక్కెట్‌ ధరలనే పండుగ రోజుల్లోను అమలు చేస్తున్నాం. అమలాపురం నుంచి హైదరాబాద్‌కు సూపర్‌ లగ్జరీ బస్సు సర్వీసుకు రూ.900, ఇంద్ర బస్సుకు రూ.1100, అమరావతి బస్సు సర్వీసుకు రూ.1400 చొప్పున సాధారణ ధరలే ప్రయాణికుల నుంచి వసూలు చేస్తాం. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి.

Updated Date - Jan 09 , 2025 | 12:43 AM