క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక పాలసీ
ABN, Publish Date - Jan 10 , 2025 | 01:05 AM
విద్యార్థులను, యువతను క్రీడల్లో ప్రోత్సహించే విధంగా ప్రత్యేక పాలసీ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. సీకే నాయుడు క్రికెట్ టోర్నమెంట్ పోటీ లను గురువారం ఆయన ప్రారంభించారు.
మంత్రి కందుల దుర్గేష్
కడియం, జనవరి 9(ఆంధ్రజ్యోతి): విద్యార్థులను, యువతను క్రీడల్లో ప్రోత్సహించే విధంగా ప్రత్యేక పాలసీ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. సీకే నాయుడు క్రికెట్ టోర్నమెంట్ పోటీ లను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓ ప్రక్క క్రీడలకు, మరో ప్రక్క కళాసంస్కృతి వైభవానికి సమ ప్రాతినిధ్యమిచ్చి అన్నిరంగాల్లో ముందుకు తీసుకు వెళ్లే విధంగా ప్రభుత్వం కృసి చేస్తోందన్నారు. యువత కోడిపందేలు, పేకా ట జోలికి వెళ్లకుండా క్రీడలపై మక్కువ చూపా లన్నారు. ఇదిలా ఉండగా మాధవరాయుడుపాలెంలో సర్పంచ్ అన్నందేవుల చంటి సాగు చే స్తున్న మినుము, పెసలు పంటను మంత్రి దు ర్గేష్ పరిశీలించారు. ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట వేస్తుందని, ఆరోగ్యకరమైన ఆహారానికి రైతులు ప్రకృతి వ్యవసాయం సాగుచేయాలన్నారు. చంటి మాట్లాడుతూ ఐదేళ్లుగా తాను వరి, అపరాలు ప్రకృతి వ్యవసాయం ద్వా రా సాగు చేస్తున్నామన్నారు. ప్రకృతి వ్యవసా యం జిల్లా మేనేజర్ బి.తాతారావు మాట్లాడు తూ జిల్లాలో 37,641 ఎకరాల్లో 32,393 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమాల్లో ఎంపీపీ వెలుగుబంటి ప్ర సాద్, పసల నాయుడు, గిరజాల బాబు, గట్టి సుబ్బారావు, వెలుగుబంటి నాని,ముద్రగడ జమీ, హెచ్‌ఎం సత్యనారాయణ, గట్టి నరసయ్య, ర త్నం అయ్యప్ప, పాటంశెట్టి రవి, అడిషనల్ ప్రాజె క్టు మేనేజర్ మహబూబ్‌వలీ, ఫార్మర్ సైంటిస్టు రాము, ఎన్‌ఎఫ్‌ఏ గౌతమ్ పాల్గొన్నారు.
Updated Date - Jan 10 , 2025 | 01:05 AM