తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి పూజలు

ABN, Publish Date - Mar 15 , 2025 | 12:48 AM

అన్నవరం, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): రత్నగిరివాసుడైన సత్యదేవుడి సన్నిధిలో శుక్రవా రం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్రవణ్‌కుమార్‌ కుటుం

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి పూజలు
అన్నవరంలో జస్టిస్‌ శ్రవణ్‌కుమార్‌కు సత్యదేవుని మెమెంటో అందజేస్తున్న పీఆర్వో

అన్నవరం, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): రత్నగిరివాసుడైన సత్యదేవుడి సన్నిధిలో శుక్రవా రం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్రవణ్‌కుమార్‌ కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ పీఆర్వో కృష్ణారావు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. దర్శనానంతరం వేదపండితులు వేదాశీర్వచనాలు అందజేశారు.

భీమేశ్వరాలయంలో...

ద్రాక్షారామ, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): ద్రాక్షారామ భీమేశ్వరాలయాన్ని శుక్రవారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్రవణ్‌కుమార్‌ సతీసమేతంగా దర్శించుకున్నారు. స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. దర్శన అనంతరం వారికి వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు.

Updated Date - Mar 15 , 2025 | 12:48 AM