ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ముక్కోటి ముహూర్తం..ట్రయల్‌ పందెంతో శ్రీకారం

ABN, Publish Date - Jan 11 , 2025 | 01:50 AM

సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందాలకు పందెం బరులు సిద్ధమయ్యాయి.

అల్లవరం, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందాలకు పందెం బరులు సిద్ధమయ్యాయి. పోలీసుల హెచ్చరికలు, కోర్టు ఆంక్షల ఉన్నప్పటికీ అల్లవరం మండలంలోని పలు గ్రామాల్లో కోడిపందాలకు తగ్గేదే లే అంటూ పందాల నిర్వాహకులు రంగం సిద్ధంచేశారు. ఇప్పటికే బరుల ఏర్పాటులో బిజీగా ఉన్న వీరంతా ముక్కోటికి ముహూర్తం అంటూ కొన్నిచోట్ల ట్రయల్‌ పందాలు వేయడం విశేషం. ఏకా దశి మంచి ముహూర్తంగా ఉంటుందని, పందాలకు ఏ ఆటంకాలు రాకూడదని కోరుకుంటూ ట్రయల్‌ (కత్తు లు లేకుండా డింకీ పందెం) పందాలు వేసినట్టు సమా చారం. అల్లవరం మండలంలోని అల్లవరం సడక్‌ రోడ్డు, గుడ్డివానిచింత, కోడూరుపాడు, ఆకులవారిపేట, తూర్పులంక, గోడి, రెల్లుగడ్డ, కొమరగిరిపట్నం, గుండెపూడి, దేవగుప్తంతో సహా పదకొండు చోట్ల కోడిపందాలకు సై అంటూ పందెంబరులు సిద్ధమయ్యాయి. షామియానాలు కట్టి ఫ్లడ్‌ లైట్ల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కోర్టు ఆంక్షలు, పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో రాజకీయ సిఫారసు అండతో కోడి పందాలు సజావుగా సాగే ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి. పందాలను చూసేందుకు వచ్చే వాహనదారుల వాహనాలకు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, మాంసం అమ్మకాలకు ప్రత్యేక స్థలాలు కేటాయించారు. గుండాటలు జరుగుతాయా లేదా అన్నది తేలాల్సివున్నా ఆదాయం ఇచ్చేవి అవే. వీటికి వేలం పాటలూ మొదలైనట్టు తెలిసింది.

Updated Date - Jan 11 , 2025 | 01:50 AM